ఎమ్మెల్యే జైపాల్ కారు, ఆటో ఢీ: 8 మందికి గాయాలు

గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం కట్టబండ వద్ద జరిగిందని పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే అంగరక్షకులు, రోడ్డుపై వెళ్తున్న ఇతరులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
రెండు లారీలు ఢీ, ముగ్గురి మృతి
కర్నాటకలోని చెల్లకెర సమీపంలో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వీరు అనంతపురం జిల్లా కల్యాణదుర్గంకు చెందిన వారు.
తాళాలు పగులగొట్టి...
హైదరాబాదులోని రాజేంద్ర నగర్ ప్రాంతంలోని బుద్వేలులో నాగరాజు అనే వ్యాపారి కుటుంబ సభ్యులతో తిరుపతి వెళ్లిన సమయంలో.. కొందరు దొంగలు తాళాలు పగులగొట్టి ఇల్లు గుల్ల చేశారు. ఎనిమిది తులాల బంగారు నగరు, ఇరవై తులాల వెండి, లక్ష విలువైన సామాగ్రిని దొంగిలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications