రింగ్‌రోడ్డుపై టెక్కీ కారు దగ్ధం: లోయలో బస్, ఒకరి మృతి

కారులో పొగలు గమనించిన వెంటనే అందులో ఉన్న వారు కిందకు దిగారు. కారులో ఉన్న వ్యక్తి ఢిల్లీకి చెందిన సాఫ్టువేర్ ఇంజనీర్‌గా తెలుస్తోంది. వారు కిందకు దిగడంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసేలోగా కారు పూర్తిగా దగ్ధమైంది. మరోవైపు పంజాగుట్టలో మరో కారు దగ్ధమైంది. వోక్స్ వాగన్ కారు పంజాగుట్ట ఫ్లై ఓవర్ మీదుగా వెళ్తుండగా దగ్ధమైనట్లుగా సమాచారం.
లోయలోకి బస్సు
విశాఖపట్నం జిల్లాలోని బొర్రా రైల్వే స్టేషన్ సమీపంలో బస్సు లోయలోకి ఒరిగిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
అటవీశాఖ సిబ్బందీపై రాళ్ల దాడి
చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవులలో అటవీశాఖ సిబ్బంది పైన ఎర్రచందనం స్మగ్లర్లు రాళ్ల దాడి చేశారు. ఇరవై మంది సిబ్బంది గాయపడ్డారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి వెళ్లిన వారిపై వందమందికి పైగా ఉన్న స్మగ్లర్లు రాళ్ల దాడి చేశారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications