ఏపీని భయపెడుతున్న కరోనా!..మళ్ళీ మొదలు?
ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రస్తుతం 12 కేసులు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో 5, విశాఖలో 3, కాకినాడ జిల్లాలో 2, తూర్పుగోదావరి జిల్లాలో 1, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2 కేసులు బయటపడ్డాయి. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పాసర్లపూడిలంకలో ఓ గర్భిణికి కరోనా సోకింది.
ప్రస్తుతానికి బాధితులు ఇళ్ల వద్దే చికిత్స తీసుకుంటున్నారు. విశాఖపట్నం పరిధిలో 21 మందికి, కాకినాడ జీజీహెచ్‌లో 26 మందికి కరోనా పరీక్షలు చేశారు. కరోనాలో ఏ వేరియంటో తెలుసుకునేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ని పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులకు 100 చొప్పున ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లను పంపిణీ చేస్తున్నారు.

ఈ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన రోగుల శాంపిల్‌ను వేరియంట్ తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీ ల్యాబ్‌కు పంపుతున్నారు. విశాఖ కేజీహెచ్ లో 160 ఆక్సిజన్, వెంటిలేటర్, పడకలను సిద్ధం చేశారు. అవసరమైన ఔషధాలు, సెలైన్ బాటిల్స్ అందుబాటులో ఉంచుతున్నారు.పాలని సూచించారు. అన్ని ఆస్పత్రుల్లోను గతంలో మాదిరిగానే కొవిడ్ ప్రోటోకాల్స్‌ను పాటించడం మొదలుపెట్టారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకోవాలని.. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications