మహిళల బట్టలూడదీసిన కేసు: 16 మంది అరెస్టు

ఈ సంఘటనకు సంబంధించి ఉన్నతాధికారులు అశ్వారావు ఎస్సై, సీఐలకు చివాట్లు వేసినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కొండ్యాల గ్రామానికి వెళ్లి బాధితులతో మాట్లాడి వివరాలను సేకరించిన అనంతరం 16 మందిని గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఏప్రిల్ 15న ఇదే గ్రామానికి చెందిన నర్సింహులు హత్యకు గురయ్యాడు. ఈ హత్యతో ప్రమేయం ఉందంటూ ఆగమయ్య, అశోక్‌లను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
జైలు నుంచి విడుదలై వచ్చిన అనంతరం ఆగష్టు 11న రాత్రి అశోక్ అక్క లక్ష్మి, మేనత్త అనసూయల ఇంటికి నర్సింహులు బంధువులు వెళ్లి అశోక్ గురించి వాకబు చేశారు. వారు ఎక్కడున్నారో తమకు తెలియదని ఇద్దరు మహిళలు చెప్పినా వినకుండా మృతుని బంధువులు వారిని బట్టలూడదీసి చెట్టుకు కట్టి చితకబాదారు.
గ్రామంలో ఓ సామాజిక వర్గం పెత్తనం చెలామణి అవుతుండంతో ఈ విషయాన్ని బయటకు రాకుండా చేశారు. ఇటీవల సమగ్ర సర్వే కోసం గ్రామానికి వచ్చిన బాధితులు విలేకరులకు తెలియజేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications