టీడీపీకి తలనొప్పిగా మారిన కొత్త ఎమ్మెల్యే తీరు ..కేసు నమోదు
టీడీపీ ఎమ్మెల్యే తీరు అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. గెలిచి నెల రోజులు కూడా కాకుండానే ఆయనపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆ ఎమ్మెల్యేపై నమోదు కావడం సంచలనంగా మారింది. ఆ ఎమ్మెల్యే మరెవ్వరో కాదు..ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలిపూడి శ్రీనివాస్. తన ఇంటిని అక్రమంగా కూల్చివేశారని ఎ. కొండూరు మండలం కంభంపాడుకు చెందిన వైసీపీ ఎంపీపీ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కాగా ఎంపీపీ అక్రమంగా భారీ నిర్మాణం చేపడుతున్నారనే కారణంగా ఎమ్మెల్యే కొలికపూడి తన అనుచరులతో కలిసి ఎంపీపీకి చెందిన భవనాన్ని పాక్షికంగా కూల్చివేశారు. అయితే దీనిపై ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఎమ్మెల్యే అనుచరులు తన ఇంటిని కూల్చడం ఏంటని వైసీపీ ఎంపీపీ ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా పని చేయడంతోనే తనపై ఇలా క్షక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇలా దాడులకు పాల్పడటం సరైంది కాదని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.

అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి ప్రతిపక్ష నాయకుల కట్టడాలు కూల్చడం ఏంటని రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికి మాజీ ఎమ్మెల్యేతో గొడవ కారణంగా ఆయన తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.మరోవైపు కొలికపూడి తీరుపై పార్టీ అధినాయకత్వం కూడా అసంతృప్తితో ఉందని తెలుస్తోంది. మొదటిసారి ఎమ్మెల్యే కావడంతో కొలికపూడి నియోజకవర్గంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలు దాటి వచ్చి మరి తిరువూరులో పోటీ చేసి విజయం సాధించిన కొలికపూడి శ్రీనివాస్ దురుసు ప్రవర్తనపై సొంత క్యాడర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.












Click it and Unblock the Notifications