అమరరాజా భూ ఆక్రమణ : టీడీపీ ఎంపీ జయదేవ్ పై కేసు నమోదు : గల్లా అరుణతో సహా..కోర్టు ఆదేశాలతో..!!
టీడీపీ ఎంపీ..అమరరాజా సంస్థల అధినేత గల్లా జయదేవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన పొలం ఆక్రమించారంటూ ఆయన పైన ఒక రైతు న్యాయస్థానం లో పిటీషన్ దాఖలు చేసారు. దీంతో..కోర్టు ఆదేశాలతో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సహా 12 మందిపై కేసులు నమోదు చేసారు. అందులో గల్లా రామచంద్రనాయుడు పేరు సైతం ఉన్నట్లుగా చెబుతున్నారు. చిత్తూరు జిల్లా తవణంపల్లె పోలీస్‌స్టేషన్ పరిధిలో వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
గల్లా అరుణకుమారి తండ్రి దివంగత రాజగోపాల్‌నాయుడు పేరిట ఏర్పాటు చేసిన రాజన్న ట్రస్ట్, ఎడ్యుకేషన్ సొసైటీల కోసం దిగువమాఘం గ్రామంలో భవనాలు నిర్మించారు. ఆ భవనాల సమీపంలో ఉన్న తన పొలాన్ని ఆక్రమించి భారీ ఎత్తున ప్రహరీ నిర్మించారని అదే గ్రామానికి చెందిన రైతు గోపీకృష్ణ ఆరోపిస్తున్నారు. తన భూమికోసం ఆయన 2015 నుంచి వివిధ రూపాల్లో ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోవడంతో 2నెలల కిందట కోర్టును ఆశ్రయించారు.

విచారణ చేపట్టిన చిత్తూరు నాలుగో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు సదరు ట్రస్ట్ సంబంధీకులతోసహా ఆ గ్రామ బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో ఐపీసీ 109, 120బి, 430, 447, 506, ఆర్/డబ్ల్యూ149 ఐపీసీ ఆర్/డబ్ల్యూ 156(3) సీఆర్‌పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాజన్న ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, చైర్‌పర్సన్ గల్లా అరుణకుమారి, సభ్యులు గల్లా రామచంద్రనాయుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, గల్లా పద్మావతి, గోగినేని రమాదేవి, కార్యదర్శి సి.రామచంద్రరాజు, ఉద్యోగులు ఎం.పార్థసారథి, భక్తవత్సలనాయుడు, ఎం.మోహన్‌బాబు, న్యాయవాది చంద్రశేఖర్, సర్పంచ్, కార్యదర్శిపై కేసులు నమోదు చేసారు.
గతంలోనూ అమరరాజా సంస్థల కాలుష్యం పైన పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. పరిశ్రమ కంటే ప్రజల ప్రాణాల ముఖ్యమంటూ అధికార పార్టీ నేతలు అభిప్రాయ పడ్డారు. ఇక, ప్రభుత్వ వేధింపులు భరించలేదక అమరరాజా సంస్థ చెన్నైకి తరలిపోతుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనికి ఆ తరువాత సంస్థ యాజమాన్యం వివరణ ఇచ్చింది. అటువంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది.
Recommended Video
ఇక, ఇప్పుడు భూ ఆక్రమణ కేసులో గల్లా కుటుంబం పైన కేసుల నమోదు అయింది. గల్లా జయదేవ్ ప్రస్తుతం గుంటూరు నుంచి వరుసగా టీడీపీ ఎంపీగా గెలుపొందారు. లోక్ సభ లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. ఈ కేసు వ్యవహారం పైన సంస్థ నుంచి అధికారికంగా స్పందన రావాల్సి ఉంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications