వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ, టీకి పంపకాలు: కేంద్రం జాగ్రత్త, కేవియట్ పిటిషన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అఖిల భారత సర్వీసుల అధికారుల పంపకాల నేపథ్యంలో కేంద్రం క్యాట్ (కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్)లో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రాష్ట్రాలకు అధఇకారుల పంపకాలలో అవాంతరాలు అధిగమించేందుకు కేంద్రం ఈ చర్య తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అధికారుల పంపకాలలో జాప్యం నివారించడానికి ఈ పిటిషన్ వేసింది. అధికారుల పంపకాలలో ఎలాంటి మార్పులు ఉండవని ప్రత్యూష్ సిన్హా కమిటీ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఏ అధికారి అయినా తనకు అన్యాయం జరిగిందని భావిస్తే, ప్రక్రియ ఆగకుండా కేంద్రం ముందు జాగ్రత్త చర్యగా ఈ పిటిషన్ వేసింది.

CAVEAT petition in CAT

తమకు సమాచారం ఇవ్వకుండా ఆలిండియా సర్వీసుల అధికారుల అభ్యంతరాల పైన ఎలాంటి ఉత్తర్వులు వెల్లడించవద్దని కేంద్రం కోరింది. ప్రత్యూష్ సిన్హా కమిటీ ఉద్యోగుల పంపకాలలో మార్పులు లేవని చెప్పిన విషయం తెలిసిందే. ఈ రోజు ప్రధానికి ఈ జాబితా ఇవ్వనుంది. ఈ కమిటీ నివేదిక పైన ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ వేసే అవకాశాలున్న నేపథ్యంలో కేంద్రం ముందు జాగ్రత్తగా కేవియట్ దాఖలు చేసింది.

English summary
Narendra Modi government filed CAVEAT petition in CAT on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X