వివేకా కేసులో సాక్ష్యులకు తీవ్ర బెదిరింపులు- సీబీఐ సంచలనం-వారి బెయిల్ రద్దుకు వినతి

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులను గుర్తించిన సీబీఐ.. వారిని కటకటాల వెనక్కి కూడా పంపింది. అయితే కోర్టుల్ని ఆశ్రయించి వారు బెయిల్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వారిని ఉద్దేశించి సీబీఐ తాజాగా హైకోర్టులో వినిపించిన వాదన ప్రాధాన్యం సంతరించుకుంది. అంతే కాదు ఈ కేసులో సాక్ష్యుల భధ్రతపై కొత్త ప్రశ్నలు లేవెనెత్తింది.

వివేకా కేసులో మరో మలుపు

వివేకా కేసులో మరో మలుపు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తులో భాగంగా ఆయన కుటుంబ సభ్యులు, వైఎస్ కుటుంబీకులతో పాటు పలువురు సాక్ష్యులు వాంగ్మూలాలు ఇచ్చారు. ఈ వాంగ్మూలాలన్నీ దాదాపుగా వైఎస్ కుటుంబానికి చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్జితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ఆయన సోదరుడు మనోహర్ రెడ్డిపై అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో వారి వాంగ్మూలాల ఆధారంగా ఈ కేసును కొలిక్కి తెచ్చేందుకు సీబీఐ అడుగులు వేస్తోంది. అయితే ఈ వాంగ్మూలాలు ఇచ్చిన సాక్ష్యుల భద్రత మాత్రం ప్రశ్నార్ధకంగా మారింది.

సాక్షుల భద్రత ప్రశ్నార్ధకం

సాక్షుల భద్రత ప్రశ్నార్ధకం

వివేకా హత్య కేసులో నిందితుల గురించి సాక్ష్యం చెప్పిన వారంతా ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీనికి కారణంగా ఈ హై ప్రొఫైల్ కేసు ఏపీలో అధికార పార్టీని నడుపుతున్న వైఎస్ కుటుంబానికి చెందినది కావడం. ఇందులో ఏమాత్రం తేడా జరిగినా ప్రభుత్వ ప్రతిష్ట మసకబారే ప్రమాదం పొంచి ఉండటమే. దీంతో ఈ కేసులో వాంగ్మూలాలు ఇచ్చిన సాక్షుల భద్రతపై ఆందోళన పెరుగుతోంది. వీరికి పూర్తిస్ధాయిలో భద్రత కల్పించాలని ఇప్పటికే కడప కోర్టుతో పాటు హైకోర్టు కూడా ప్రభుత్వానికి సూచించింది. అయినా పరిస్ధితిలో మార్పు లేదని తెలుస్తోంది.

తీవ్ర బెదిరింపులు వస్తున్నాయన్న సీబీఐ

తీవ్ర బెదిరింపులు వస్తున్నాయన్న సీబీఐ

వివేకా హత్య కేసులో తమకు వాంగ్మూలం ఇచ్చిన సాక్షులకు నిందితుల నుంచి తీవ్ర బెదిరింపులు వస్తున్నాయని తాజాగా సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పటికే సీబీఐ అరెస్టు చేసిన నిందితుల్లో కొందరు బెయిల్ పై బయటికి వచ్చారు. మరికొందరు హైకోర్టును బెయిల్ కోరుతున్నారు. వీరికి అస్సలు బెయిల్ ఇవ్వొద్దని, ఇప్పటికే వీరి నుంచి సాక్ష్యులకు బెదిరింపులు ఎక్కువయ్యాయని సీబీఐ హైకోర్టులో వాదించింది. ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటివరకూ ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, ఆయన అనుచరులు సాక్ష్యుల్ని తీవ్రంగా బెదిరిస్తున్నట్లు సీబీఐ హైకోర్టుకు తెలిపింది.

 సీబీఐ సంచలన ఆరోపణలు

సీబీఐ సంచలన ఆరోపణలు

వివేకా కేసులో మెజిస్ట్రేట్ ముందు సాక్ష్యం చెప్పేందుకు సిద్ధమైన సీఐ శంకరయ్య, గంగాధర్ రెడ్డి,కృష్ణారెడ్డి వంటివారు ఈ ప్రలోభాలు, బెదిరింపుల కారణంగానే వెనక్కి తగ్గారని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. ఆ తర్వాత సీఐ శంకరయ్యకు ప్రభుత్వం నుంచి పోస్టింగ్ కూడా దక్కిందని వెల్లడించింది. ప్రస్తుతం గంగిరెడ్డి మినహా మిగిలిన నిందితులంతా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని, ఈయనకు కూడా పులివెందుల కోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దుచేయాలని హైకోర్టును సీబీఐ కోరుతోంది.

ఇప్పటికే వివేకా కేసులో ప్రధాన సాక్ష్యులుగా ఉన్న వాచ్ మన్ రంగన్న, అప్రూవర్ గా మారిన కారు డ్రైవర్ దస్తగిరికి భద్రత కల్పించాలని సీబీఐ కడప కోర్టులో పిటిషన్ వేసింది. ఇప్పుడు గంగిరెడ్డి కారణంగా సాక్ష్యులకు భద్రత కరవవుతుందని సీబీఐ వ్యక్తం చేస్తున్న ఆందోళన ప్రాధాన్యం సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+