రూ. 500 కోట్ల కాంట్రాక్టు పనుల్లో లంచాలు, సీబీఐ దెబ్బకు గుత్తిలో గూబ పగిలింది

ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ అధికారులు పంజా విసరడం హాట్ టాపిక్ అయ్యింది రూ. 500 కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లను పట్టిపీడించి లంచాలు తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సీబీఐ అధికారులు వారిని విచారణ చేసిన మొత్తం మ్యాటర్ బయటకు లాగాలని ప్రయత్నిస్తున్నారు.

అనంతపురం డీఆర్ఎం (రైల్వే) వినీత్ సింగ్, డీఎఫ్ఎం ప్రదీప్ బాబు, సీనియర్ రైల్వే డివిజన్ ఇంజనీర్ లక్కిరెడ్డి, రైల్వే ఎస్ఈ బాలాజీలతో పాటు అకౌంటెంట్ అసిస్టెంట్ లక్ష్మీపతిరాజులను అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లి వారికి వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్యపరీక్షలు నిర్వహించిన తరువాత సీబీఐ అధికారులు నిందితుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

CBI arrested a bunch of railway officials who were taking huge bribes

అవినీతి అధికారులు అయిన వీళ్లు లంచాలు తీసుకుంటున్నందును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని, అందుకే అరెస్టు చేసి కర్నూలులోని సీబీఐ కోర్టు ముందు హాజరుపరుస్తున్నామని రైల్వే అధికారులు నిందితుల కుటుంబ సభ్యులకు సీబీఐ అధికారులు సమాచారం ఇచ్చారు. గుత్తిశక్తి పథకంలో భాగంగా రైల్వే లైన్ల అభివృద్ధి కోసం జరుగుతున్న పనుల కోసం రూ. 500 కోట్ల విలువైన అభివృద్ధి పనుల కోసం రైల్వే అధికారులు టెండర్లు పిలిచారు.

పీలేరుకు చెందిన కాంట్రాక్టర్ రమేష్ రెడ్డి, జమ్మలమడుగుకు చెందిన మరో కాంట్రాక్టర్ తో పాటు కొందరు పనులు దక్కించుకున్నారు. అయితే పనులకు సంబంధించి పనులు చెయ్యడానికి రైల్వే ఫైనాన్స్ విభాగం అధికారులు కాంట్రాక్టర్ల నుంచి భారీ మొత్తంలో లంచాలు డిమాండ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఫైవ్ స్టార్ హోటల్ లో రూమ్ లు బుక్ చెయ్యాలని చెప్పి కాంట్రాక్టర్ల దగ్గర విపరీతంగా డబ్బులు ఖర్చు చేయించారని, వారి దగ్గర భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.

రైల్వే అధికారుల అవినీతి ఎక్కువ కావడంతో కాంట్రాక్టర్ రమేష్ రెడ్డితో పాటు కొందరు కాంట్రాక్టర్లు సీబీఐ అధికారులను ఆశ్రయించారు. పక్కాప్లాన్ చేసిన సీబీఐ అధికారులు రమేష్ రెడ్డిని ముందుంగా రంగంలోకి దింపారు. కాంట్రాక్టర్ రమేష్ రెడ్డి దగ్గర లంచం తీసుకుంటున్న రైల్వే అధికారులను సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితులను గుంతకల్ డీఆర్ ఎం వినీత్ సింగ్ తో పాటు అధికారులు అందరిని విచారణ చేస్తున్నామని, కేసు దర్యాప్తులో ఉందని సీబీఐ అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+