సరైన సమాధానాలు చెప్పడంలేదు.. కస్టడీకివ్వండి: సీబీఐ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి, అనుచరుడు ఉదయ్‌కుమార్ రెడ్డి కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో జరిగిన వాదనలు ముగిశాయి. 10రోజులపాటు ఇద్దరినీ తమ కస్టడీకివ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయమై మధ్యాహ్నం తర్వాత కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించనుంది.
నిందితులను తమ కస్టడీకిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని, దర్యాప్తు సజావుగా సాగేందుకు నిందితులు సహకరించడంలేదని, తమ ప్రశ్నలకు సరైన సమాధానాలు కూడా ఇవ్వడంలేదని సీబీఐ తరఫు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. సీబీఐ కస్టడీ పిటిషన్ సరిగా లేదని నిందితుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మధ్యాహ్నం తర్వాత తమ నిర్ణయాన్ని వెలువరిస్తామని సీబీఐ కోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుచేయాలంటూ దాఖలైన పిటిషన్ ఈనెల 20వ తేదీకి వాయిదా పడింది.

కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. రేపు ఉదయం 10.00 గంటలకు రావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు సమాచారం ఇచ్చారు. పలు దఫాలుగా అవినాష్ రెడ్డి సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. ఎంపీని విచారించే సమయంలో సీబీఐ వీడియోతోపాటు ఆడియో రికార్డింగ్ చేయనుంది. భాస్కర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో అవినాష్ రెడ్డిని సీబీఐ సహ నిందితుడిగా పేర్కొంది.












Click it and Unblock the Notifications