సిటీలో భర్త.. ఇంట్లో ప్రియుడు : పిచ్చెక్కించే ట్విస్టులతో ఫుల్ రొమాంటిక్ మూవీ !!

సినీ ప్రేక్షకుల ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదవలేదు అంటే అతిశయోక్తి కాదు. ఒకవైపు థియేటర్లలో వరుసగా కొత్త సినిమాలు విడుదలవుతుండగా.. మరోవైపు ఓటీటీల్లోనూ సినిమాలతో పాటు, సిరీస్ లు ఆడియన్స్ ని అలరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం థియేటర్లలో విడుదలైన సినిమాల్లో అక్కినేని అఖిల్ నటించిన 'లెనిన్' మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మూవీ విడుదలైన తొలి రోజే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

కాగా ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్ వైపు చూడాల్సి వచ్చేది.. కానీ ఇప్పుడు 'ప్రపంచ సినిమా' మన అరచేతిలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన సినిమాలు కేవలం 15 నుంచి 20 రోజుల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రత్యక్షమవుతుండటంతో, ఓటీటీ హవా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఓటీటీ వేదికలపై సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్‌కు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. ముఖ్యంగా నిజ ఘటనల ఆధారంగా రూపొందిన సిరీస్‌లు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఓటీటీలో ఓ మలయాళ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ టాప్ ట్రెండింగ్‌లో నిలిచి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

udal-movie-trending-on-amazon-prime-videos-with-good-twists-and-full-romantic-scenes-in-cinema

ఏ మూవీ అంటే..

తెలుగు ప్రేక్షకులు మలయాళ సినిమాల పట్ల కూడా మంచి ఆదరణ చూపిస్తున్నారు. అలాంటి చిత్రాల్లో ప్రస్తుతం ఎక్కువ వ్యూస్‌తో దూసుకుపోతున్న సినిమా 'ఉడాల్' (Udal). వివాహేతర సంబంధాలు, నేరాలు వంటి అంశాలను కలగలిపి తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి నుంచి చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రతి సన్నివేశంలోనూ ఏదో ఒక ట్విస్ట్ ప్రేక్షకుడిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా కుటుంబంలోనే జరిగే మానసిక సంఘర్షణలు, ద్రోహం, ప్రతీకారం కథకు మరింత బలాన్ని తీసుకొచ్చాయి.

కథ విషయానికి వస్తే...

షైనీ, రేజి దంపతులకు ఒక కుమారుడు ఉంటాడు. ఉద్యోగ రీత్యా రేజి నగరంలో ఉండి నెలనెలా డబ్బులు పంపిస్తుంటాడు. మరోవైపు షైనీ తన కుమారుడితో పాటు అత్తమామలతో గ్రామంలోనే నివసిస్తుంది. అనారోగ్యంతో మంచాన పడిన అత్తను ఎంతో శ్రద్ధగా చూసుకుంటున్నట్లు కనిపించినా, భర్త దూరంగా ఉండటంతో ఆమె జీవితంలో మరో వ్యక్తి ప్రవేశిస్తాడు. తన పాత క్లాస్‌మేట్ కిరణ్‌తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంటుంది. కొద్ది రోజుల్లోనే ఇద్దరూ ఒకరినొకరు వదులుకోలేని స్థితికి చేరుకుంటారు.

తమ సంబంధానికి అత్తమామలే అడ్డుగా ఉన్నారని భావించిన షైనీ, కిరణ్ కలిసి వారిని హత్య చేయాలని పథకం రచిస్తారు. ముందుగా మంచాన ఉన్న అత్తను చంపాలని నిర్ణయిస్తారు. అయితే అనుకోకుండా వారి సంభాషణను మామ వింటాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న అతను ఇద్దరినీ ఓ గదిలో బంధిస్తాడు. అక్కడి నుంచి కథ పూర్తిగా ఊహించని మలుపులు తిరుగుతుంది. నిజంగా హత్య ఎవరు చేస్తారు? షైనీ, కిరణ్ అక్కడి నుంచి తప్పించుకుంటారా? మామ వారిని పోలీసులకు అప్పగిస్తాడా? లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటాడా? అనేది స్టోరీ.

ఈ చిత్రంలో రొమాంటిక్ సన్నివేశాలు హైలైట్ అయితే.. ప్రతి పాత్రను గ్రే షేడ్స్‌లో చూపించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్లైమాక్స్ వరకు కథ ఏ దిశలో వెళ్తుందో అంచనా వేయడం కష్టమేనని చెప్పాలి. మలయాళంలో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సైనా ప్లే (Saina Play) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+