జగన్ మావిగన్ ఆలోచన వెనుక - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!
మాజీ సీఎం జగన్ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీకి రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏమాత్రం లేవని వ్యాఖ్యానించారు. ఇటువంటి పార్టీతో రాష్ట్రానికి నష్టమే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని స్పష్టం చేశారు. జగన్‌ది 'హిట్ అండ్ రన్' మనస్తత్వ మని చంద్రబాబు ఆరోపించారు. మావిగన్ ప్రస్తావన వెనుక దురుద్దేశం ఉందని వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియాను కొందరు నేర మనస్తత్వం కలిగిన వ్యక్తులు దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ పోకడలు, వారి ప్రవృత్తిని చూసిన ఎవరికైనా ఇది అర్థమవుతుందని వివరించారు. భోగాపురం విమానాశ్రయం పూర్తైందని, పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులు పూర్తి కావొస్తున్నాయన్న సీఎం... ఈ నేపథ్యంలోనే గొడ్డలి పార్టీలో టెన్షన్ మొదలైందని పేర్కొన్నారు. సొంత ప్రయోజనా లు, భూములు కొట్టేసే కుట్రలో భాగంగా రైతుల భూములను 22ఏలో పెట్టి ఇబ్బందులు గురి చేశారని, వాటిని తమ ప్రభుత్వం పరిష్కరిస్తోందని అన్నారు. సొసైల్ మీడియాలో తప్పుడు పోస్టులు, వ్యక్తిత హనన పోస్టుల కట్టడికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుపై ఇంకా వర్క్‌వుట్ చేస్తున్నామని వివరించారు.

జగన్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు
బ్రహ్మణీ స్టీల్ లిమిటెడ్ నుంచి ప్రభుత్వం భూములు వెనక్కి తీసుకున్న అంశంపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. స్టీల్ ప్లాంట్ పేరుతో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారన్నారు. బ్రహ్మణీ స్టీల్ ప్లాంట్ కు కేటాయించిన భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకుందని, అయితే ఓబులాపురం మైనింగ్ అంశం ఇంకా ముగియ లేదని చెప్పారు. హిట్, రన్ అండ్ ఎస్కేప్ గొడ్డలి పార్టీ నైజమని, ఇక్కడ ఏదో ఒకటి చేయించడం, వెళ్లి పక్కరాష్ట్రంలోని బెంగళూరులో ఉండటం అలవాటైందన్నారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులు రాకుండా చేసేందుకు మావిగన్ తీసుకువచ్చారని పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications