Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి బిగ్ రిలీఫ్..!
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఇవాళ భారీ ఊరట లభించింది. తాజాగా రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకే గుడ్ బై చెప్పేసిన ఆయన తాజాగా హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు.. ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. దీంతో రాజకీయాల నుంచి తప్పుకున్న విజయసాయిరెడ్డికి భారీ ఊరట లభించినట్లయింది.
రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన తర్వాత విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజుల పాటు అన్నింటికీ దూరంగా విదేశాలకు వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫ్రాన్స్ , నార్వే దేశాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న ఆయన విదేశాలకు వెళ్లాలంటే హైదరాబాద్ సీబఈఐ కోర్టు అనుమతి తప్పనిసరి. దీంతో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైదరాబాద్ సీబీఐ కోర్టు.. సీబీఐ అభిప్రాయం కూడా తీసుకుంది. అనంతరం విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ మేరుక ఫ్రాన్స్, నార్వే వెళ్లేందుకు సాయిరెడ్డికి 15 రోజుల పాటు అనుమతి లభించింది.
వాస్తవానికి ఈ రెండు దేశాల్లో పర్యటనకు విజయసాయిరెడ్డి నెల రోజులు అనుమతి కోరినా కోర్టు మాత్రం 15 రోజులే అనుమతి ఇచ్చింది. దీంతో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10లోపు 15 రోజుల పాటు వెళ్లొచ్చిన తెలిపింది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు సిద్దమవుతున్నారు.












Click it and Unblock the Notifications