జగన్ పాదయాత్రపై తేలేది నేడే: కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

Subscribe to Oneindia Telugu
  జగన్ పాదయాత్ర : కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ | Oneindia Telugu

  హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరు నెలలపాటు, 3వేల కిలోమీటర్ల మేర చేయనున్న పాదయాత్రపై నేడే తేలనుంది. సోమవారం సీబీఐ కోర్టులో జగన్ పాదయాత్రపై తీర్పు వెలువడనుండగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాయి.

  తాను ఆరు నెలల పాటు పాదయాత్ర తలపెట్టానని, ప్రతి వారం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాలేనని, మినహాయింపు ఇవ్వాలని కోరుతూ.. వైయస్ జగన్ వేసిన పిటిషన్ పై వాదనలు ముగియగా.. సోమవారం(అక్టోబర్ 23) తీర్పు వెలువడనుంది.

  CBI court will decide on YS Jagan's Padayatra

  కాగా, గతంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో, ఆ తరువాత విదేశీ పర్యటనల సమయంలో జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించింది. ఇక ఈ దఫా కూడా మినహాయింపు లభించవచ్చనే న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

  హాజరుకు ఇబ్బందేంటి?: జగన్ 'వ్యక్తిగత హాజరు మినహాయింపు'పై 23న తీర్పు

  జగన్‌కు అనుమతి ఇవ్వవద్దని సీబీఐ చేసిన వాదనల్లో పెద్దగా పస లేదని వారు అంటున్నారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరే హక్కు జగన్‌కు లేదని వాదించడం మినహా, వద్దని చెప్పడానికి సహేతుక కారణాలను సీబీఐ న్యాయవాదులు కోర్టు ముందు ఉంచలేకపోయిందని.. ఈ మధ్యాహ్నం తీర్పు జగన్‌కు అనుకూలంగానే ఉంటుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  CBI court will decide on YSRCP president YS Jaganmohan Reddy's Padayatra on Monday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి