Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జ‌న‌సేన‌లో చేరిన ల‌క్ష్మీనారాయ‌ణ : సీమ‌ నుండి ఎంపీగా బరిలోకి : వైసిపి వ‌ర్సెస్ మాజీ జేడి..!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కండువ కప్పి లక్ష్మీనారాయణ ను జనసేనలోకి ఆహ్వానించారు. శ‌నివారం అర్దరాత్రి జ‌న‌సేన కార్యాల‌యంలో ప‌వ‌న్ తో ల‌క్ష్మీనారాయ‌ణ స‌మావేశం అయ్యారు. ఆ స‌మ‌యంలోనే చేరిక పై నిర్ణ‌యం తీసుకున్నారు. ల‌క్ష్మీనార‌య‌ణ ఎంపీగా రాయ‌ల‌సీమ నుండి కీల‌క‌మై న నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఎట్ట‌కేల‌కు జ‌న‌సేన‌లోకి..

ఎట్ట‌కేల‌కు జ‌న‌సేన‌లోకి..

సిబిఐ జేడీ గా ప‌ని చేసిన ల‌క్ష్మీనారాయ‌ణ స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఆయ‌న ఏపిలో రాజ‌కీయ‌ల్లో చేరుతార‌ని చాలా కాలంగా ప్ర‌చారం జ‌రిగింది. తొలుత బిజెపిలో చేరుతార‌ని..ఆ త‌రువాత జ‌న‌సేన లో చేరుతున్నార‌ని పెద్ద ఎత్తు న ప్ర‌చారం సాగింది. అయితే, ఆయ‌న రైతు..యువ‌త స‌మ‌స్య‌ల పై ఏపి వ్యాప్తంగా పర్య‌టించారు. ఆ త‌రువాత లోక్‌స త్తా పార్టీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించి.. ఏపిలో ఆ పార్టీ ని బ‌లోపేతం కోసం చ‌ర్చ‌లు సాగాయి. కానీ, అది ఆదిలో నే నిలిచిపోయింది. ఆ త‌రువాత సొంతంగా జ‌న‌ధ్వ‌ని పేరుతో పార్టీ పెడుతున్నార‌ని చెప్పుకొచ్చారు. అది సాధ్యం కాలే దు. ఇక‌, కొద్ది రోజుల క్రితం టిడిపిలో చేరుతున్నార‌ని..భీమిలి నుండి పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌ర‌గ్గా..ప‌రోక్షంగా సీయం చంద్ర‌బాబు సైతం స‌మ‌ర్ధించారు. ఇక‌, ఇప్పుడు స‌డ‌న్ గా జ‌న‌సే లో చేరాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాన్ తో చ‌ర్చ‌లు జ‌రిపి ఈ రోజు ప‌వ‌న్ స‌మక్షంలో జ‌న‌సేన లో చేరారు.

వైసిపికి టార్గెట్ అవుతున్నారా..

వైసిపికి టార్గెట్ అవుతున్నారా..

జెడిగా జ‌గ‌న్ కేసుల విచార‌ణ స‌మ‌యంలోనే ల‌క్ష్మీనారాయ‌న పై వైసిపి నేత‌లు విమ‌ర్శ‌లు చేసారు. ఆయ‌న టిడిపి అధినేత చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లో ప‌ని చేస్తున్నార‌ని ఆరోపించారు. తాజాగా లక్ష్మీనారాయ‌ణ టిడిపిలో చేరుతార‌నే ప్ర‌చారం జ‌రిగిన స‌మ‌యంలోనూ అదే ర‌కంగా వైసిపి నేత‌లు స్పందించారు. ఇంత కాలం తెర చాటున సాగిన వీరిద్ద రి బంధం ..ఇక ఇప్పుడు ఎన్నిక‌ల వేళ ఓపెన్ అవుతోంద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. వాస్త‌వంగా 2014 లోనే ల‌క్ష్మీనారాయ ణ టిడిపి నుంటి పోటీ చేయాల‌ని ప్ర‌య‌త్నించినా..వైసిపి కార‌ణంగానే ఆగిపోయింది. ఇక‌, ఇప్పుడు జ‌న‌సేన సైతం వైసిపికి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధి పార్టీ కావ‌టం తో పాటుగా..ఇప్ప‌టికే చంద్ర‌బాబు - ప‌వ‌న్ మ‌ధ్య బంధం ఉంద‌ని వైసిపి నేత లు ఆరోపిస్తున్నారు. ఇక‌, ఇప్పుడు ప‌వ‌న్ తో పాటుగా ల‌క్ష్మీనారాయ‌ణ వైసిపికి ల‌క్ష్యంగా..అదే విధంగా ల‌క్ష్మీనారాయ‌ణ సైతం త‌న పై ఇప్ప‌టి వ‌ర‌కు వైసిపి చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం చెప్పుకొనే ప్ర‌య‌త్నం జ‌ర‌గ‌నున్నాయి.

సీమ నుండి ఎంపీగా బ‌రిలోకి..

సీమ నుండి ఎంపీగా బ‌రిలోకి..

ఇక‌, ల‌క్ష్మీనారాయ‌ణ విశాఖ జిల్లా నుండి పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, విశాఖ నుండి ప‌వ‌న్ క‌ళ్యాన్ పోటీ చేసే అవ‌కాశం ఉండ‌టంతో..రాయ‌ల‌సీమ నుండి లక్ష్మీనారాయ‌ణ ను బ‌రిలోకి దింపాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించారు. గ‌తంలో రాయ‌ల‌సీమ ప్రాంతంలో రైతుల స‌మ‌స్య‌ల పైన ల‌క్ష్మీనారాయ‌ణ ప‌ర్య‌టించారు. అదే విధంగా జ‌న‌గ్ కు ప‌ట్టు ఉన్న రాయ‌ల‌సీమ ప్రాంతంలో జెడిని బ‌రిలోకి దింప‌టం ద్వారా రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. దీంతో..అనంత‌పురం లేదా హిందూపురం లోక్‌స‌భ స్థానం నుండి లక్ష్మీనారాయ‌ణ బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉన్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. జెడి క‌ర్నూలు వైపు మొగ్గు చూపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రానికి జెడి పోటీ చేసే స్థానం పై క్లారిటీ రానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+