సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనివారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరబోతున్నట్లు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తెలిపారు. రాజకీయ పార్టీలు, నాయకులు తమ తమ వ్యక్తిగత అజెండాతోనే పోటీచేస్తున్నారన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలోని ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ప్రతి ఎన్నికల్లో 95 నుంచి 99 శాతం వరకు ఓటు హక్కు వినియోగమైతేనే రాజకీయంగా మార్పు సాధ్యపడుతుందన్నారు. ఎన్నికలకు ముందు ప్రీ పోల్ సర్వేలు ప్రకటించకుండా ఉండటమనేది చాలా ముఖ్యమన్నారు. ఓటు హక్కు వినియోగం తప్పనిసరి చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీకి దిగనున్నట్లు వెల్లడించారు. సమాజం కోసం పనిచేయాలనుకునేవారే రాజకీయాల్లోకి రావాలని, ప్రజల్లో చైతన్యం వస్తే మార్పు రేపే వస్తుందన్నారు.

cbi ex jd vv lakshminarayana latest comments

ఓటు హక్కును వినియోగించుకొని రాజులవుతారా? లేదంటే విక్రయించుకొని బానిసలవుతారా? అన్న డాక్టర్ అంబేద్కర్ కామెంట్స్ ను జేడీ మరోసారి గుర్తుచేశారు. పార్టీలను, మతాలను, కులాలను కుండా పోటీకి దిగిన వ్యక్తులను బట్టి ఓటెయ్యాలన్నారు. ప్రజాస్వామ్యంలో అన్నింటికంటే ముఖ్యమైంది రాజ్యాంగం అన్నారు.

రానున్న ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఆయన 2019 ఎన్నికల్లో విశాఖపట్నం లోక్ సభ నుంచి జనసేన తరఫున పోటీపడి ఓటమిపాలయ్యారు. తర్వాత జనసేనకు గుడ్ బై చెప్పారు. సొంతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో చెప్పడం మాత్రం.. విశాఖ నుంచి పోటీచేస్తానన్నారు. ఇప్పుడు మాత్రం ఎక్కడ పోటీచేసేది స్పష్టత ఇవ్వలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+