YS Viveka case: భాస్కర రెడ్డి పాత్ర కీలకం - సీబీఐ, నెక్ట్స్ టార్గెట్..!?
వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ వైఎస్ అవినాష్ తండ్రి భాస్కర్రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. సీబీఐ తొలి నుంచి భాస్కర రెడ్డి పాత్ర పైన అనేక అభియోగాలు నమోదు చేసింది. ఈ తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో సీబీఐ అధికారులు పులివెందుల లోని భాస్కర రెడ్డి ఇంటికి చేరుకున్నారు.
భాస్కరరెడ్డిని కీలక పాత్ర ఉందని వెల్లడించిన అధికారులు ..అరెస్ట్ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. తమ న్యాయవాదిని అనుమతించాలని కోరినా సీబీఐ అధికారులు అంగీకరించలేదు. ఇక, ఇప్పుడు సీబీఐ తదుపరి అడుగుల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

భాస్కర రెడ్డి అభ్యర్ధన తిరస్కరణ: సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నెలాఖరులోగా సీబీఐ వైఎస్ వివేకా హత్య కేసును తేల్చాల్సి ఉంది. ఈ కేసులో ఈ ఉదయం నుంచి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెల్లవారుజామున 5.10 గంటలకు రెండు టీంలుగా సీబీఐ అధికారులు పులివెందులలోని భాస్కర రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి ఎవరినీ అనుమతించ లేదు.
భాస్కర రెడ్డి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేస్తున్నట్లు చెప్పారు. అరెస్ట్ చేస్తున్నామని వెల్లడించారు. భాస్కర రెడ్డి ఇంట్లోనే అరెస్ట్ మెమో సిద్దం చేసారు. వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు కుటుంబ సభ్యులకు తెలిపారు. న్యాయవాదిని అనుమతించాలని కోరినా సీబీఐ అధికారులు అంగీకరించలేదు. తమ వాహనాల్లోనే భాస్కరరెడ్డిని పులివెందుల నుంచి హైదరాబాద్ తరలించారు.
భాస్కర రెడ్డి పాత్ర కీలకమంటూ: భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. ముందుగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డిపై సెక్షన్ 120బి, రెడ్ విత్ 201, 302 ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని పేర్కొన్నారు.
వివేకా హత్యకు ముందు.. తరువాత నిందితులను భాస్కర్ రెడ్డి ఇంటికి పిలిచి మాట్లాడారని తెలిపారు. ఇందుకు వైఎస్ లక్ష్మీ, పీ జనార్దన్ రెడ్డిలను సాక్షులుగా పేర్కొన్నారు. 120బి కుట్ర, 302 ముర్డర్, 201 ఆధారాలు చేరిపివేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం సీబీఐ మేజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరు పరచనున్నారు.
నెక్స్ట్ టార్గెట్ ఎవరు..: ఇప్పుడు వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర రెడ్డిని అరెస్ట్ చేయటంతో సీబీఐ నెక్స్ టార్గెట్ ఎవరనే చర్చ మొదలైంది. ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోని నివాసంలో ఉన్నారు. ఆయన ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లినట్లు ప్రచారం జరిగినా..నిర్ధారణ కాలేదు. తాజాగా ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సీబీఐ ప్రధానంగా ఆధారాల టాంపరింగ్ జరిగిందని పేర్కొంది.
ఉదయ్‌కుమార్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ఘటనా స్థలంలో ఆధారాలు తారుమారు చేశారని.. హత్య తర్వాత ఉదయ్‌కుమార్‌రెడ్డి అవినాష్‌రెడ్డి ఇంటికి వెళ్లాడని సీబీఐ తెలిపింది. అటు భాస్కర రెడ్డి అరెస్ట్ లో పులివెందులలో వైసీపీ శ్రేణులు శాంతియుత నిరసనలకు నిర్ణయించారు. ఇటు ,సీబీఐ నెక్స్ట్ ఏం చేయబోతుందనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications