Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెజవాడ ఇళ్ల కూల్చివేతపై సీబీఐ ? జగన్ షాకింగ్-తేల్చేసిన చంద్రబాబు..!

ఏపీలో విజయవాడ భవానీపురంలో ఉన్న జోజినగర్ లో తాజాగా 42 ఇళ్ల కూల్చివేత వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కోర్టు ఆదేశాలను సాకుగా చూపుతూ తాజాగా అక్కడ ఉన్న ఇళ్లను స్ధానిక అధికారులు కూల్చేయడం రాజకీయ రంగు పులుముకుంది. దీంతో ఆయా బాధితులు విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఆశ్రయించారు. దీంతో ఆయన ఇవాళ భవానీపురం వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

జోజి నగర్ లో ఇళ్ల కూల్చివేతపై సీబీఐ విచారణ చేయించాలని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ ఇళ్ల కూల్చివేతకు సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, స్థానిక ఎంపీ కేశినేని చిన్ని, స్థానిక కార్పొరేటర్‌ సోదరుడే కారణమని ఆరోపించారు. కాబట్టి సీబీఐ విచారణతో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని జగన్ తెలిపారు. అలాగే జోజినగర్‌ బాధితుల బ్యాంక్‌ రుణాలు ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ 42 కుటుంబాలకు తిరిగి ఇళ్లన్నీ కట్టించి ఇవ్వాలన్నారు.

CBI vs Court Jagan Chandrababu Clash Over Vijayawada Houses Demolition

పేదలకు ఏ ప్రభుత్వమైనా అండగా నిలబడాలని జగన్ తెలిపారు. కానీ, ఇక్కడ ప్రభుత్వమే వారికి వ్యతిరేకంగా పిటిషన్లు వేస్తోందన్నారు. జోజినగర్‌ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని, లేని పక్షంలో తమ ప్రభుత్వం రాగానే విచారణ తథ్యమని జగన్ హెచ్చరించారు. ఈ ఘటనకు బాధ్యులను బోనులో నిలబెట్టి తీరుతామన్నారు. జోజినగర్‌ బాధితులకు పూర్తి అండగా నిలబడతామని, వారి న్యాయ పోరాటానికి పార్టీ తోడుగా ఉంటుందని జగన్ హామీలు ఇచ్చారు.

CBI vs Court Jagan Chandrababu Clash Over Vijayawada Houses Demolition

ఇక్కడే కాదు. రాష్ట్రమంతా ఇదే కొనసాగుతోందని, అనేక చోట్ల ఎక్కడైనా చిన్న చిన్న లిటిగేషన్లు ఉంటే, టీడీపీ నాయకులు ఎంటర్‌ అవుతున్నారని, భూమి కబ్జా చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఇంకా కొన్ని చోట్ల వారే స్వయంగా లిటిగేషన్లు పెట్టి, కబ్జా చేస్తున్నారని విమర్శించారు. అందుకే ఈ వ్యవహారంపై వెంటనే సీబీఐ దర్యాప్తు జరిపించాలన్నారు. మరోవైపు జోజి నగర్ బాధితులకు మద్దతుగా జగన్ చేసిన వ్యాఖ్యలు, సీబీఐ విచారణ డిమాండ్ పై సీఎం చంద్రబాబు స్పందించారు. మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ జగన్ అక్కడికి వెళ్లి చేసేది ఏముందన్నారు. ఈ వ్యవహారం ఇప్పటికే కోర్టులో ఉన్న విషయాన్ని గుర్తుచేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+