Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎంకు సీబీఐ మాజీ జేడీ కంగ్రాట్స్, వరుస ట్వీట్లు- టార్గెట్ ఎవరు..!?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ తో రాజకీయం ఆసక్తి కరంగా మారింది. చంద్రబాబును జైలులో పరామర్శించిన పవన్ కల్యాణ్ అక్కడే టీడీపీ - జనసేన పొత్తు ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం గా ఆరోపణలు చేస్తున్నారు. ఈ సమయంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్లు ఆసక్తి కరంగా మారాయి. తన ట్వీట్ లో గుంటూరు శేషేంద్ర శర్మ చెప్పిన పంక్తులను ప్రస్తావించారు. అదే విధంగా ఇద్దరు తెలుగు సీఎంలకు కంగ్రాట్స్ చెప్పారు.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అటు రాజమండ్రి వేదికగా టీడీపీ - జనసేన పొత్తు గురించి పవన్ కల్యాణ్ ప్రకటన చేసారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేసారు. అయితే, ఈ వ్యవహారాన్ని ఎక్కడా ప్రస్తావించకపోయినా..మాజీ జేడీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతంది. సాధారణంగా పవన్ కల్యాణ్ అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలోనూ గుంటూరు శేషేంద్ర శర్మ రచనలను ప్రస్తావిస్తూ ఉంటారు. ఇప్పుడు మాజీ చేసిన ట్వీట్ లోనూ శేషేంద్ర శర్మ రచనల్లోని కొన్ని పంక్తులను ఆయన ఫొటోతో పాటుగా పోస్టు చేసారు. అందులో ప్రస్తావించిన పంక్తులను చూసిన వారు..జేడీ చేసిన ఈ ట్వీట్ ఉద్దేశం ఏంటో చెప్పకనే చెబుతున్నారు.

CBI JD Lakshmi Narayana

మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆ ట్వీట్ లో "సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు.. తుపాను గొంతు చిత్తం అనడం ఎరుగదు.. పర్వతం వంగి ఎవడికి సలాం చెయ్యదు.. నేను ఒక పిడికెడంత మట్టే కావచ్చు.. కానీ తల ఎత్తితే ఈ దేశపు జెండాకున్నంత పొగరుంది" అనే పంక్తులను పోస్టు చేసారు. పవన్ ఎన్నో సందర్భాల్లో ఈ కవితను సభల్లో చెప్పారు.

CBI JD Lakshmi Narayana

ఇదే సమయంలో మరో ట్వీట్ చేసిన మాజీ జేడీ ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కంగ్రాట్స్ చెప్పారు. వైట్ కోట్ రివోల్యూషన్ అంటూ పోస్టు చేసారు. ఈ రోజు అటు తెలంగాణలో..ఇటు ఏపీలో ఇద్దరు ముఖ్యమంత్రులు కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. మాజీ జేడీ ఈ సందర్భంలో ఇద్దరు సీఎంలకు అభినందనలు తెలిపారు.

2019 ఎన్నికల్లో మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన నుంచి పోటీ చేసారు. విశాఖ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత కొంత కాలానికే జనసేను వీడారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తానని చెబుతున్న లక్ష్మీనారాయణ..తాను స్వతంత్ర అభ్యర్దిగానే బరిలో ఉంటాననే సంకేతాలు ఇస్దున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ సమయంలో టీడీపీ అధినేత అరెస్ట్...పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు వేళ..ఇప్పుడు లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్ల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయంగా ఇప్పుడు ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+