తెలంగాణ దెబ్బ!: ఏపీ వారికి శుభవార్త, తగ్గనున్న మొబైల్ ధరలు
విజయవాడ: ఏపీలో మొబైల్ వినియోగదారులకు శుభవార్త రాష్ట్రంలో ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. సెల్ ఫోన్ చార్జర్లు, బ్యాటరీలపై, స్టిల్ ఇమేజ్ వీడియో కెమెరా, బ్యాటరీ చార్జర్ల పైన ప్రభుత్వం వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 14.5 శాతం ఉన్న వ్యాట్‌ను 5 శాతానికి తగ్గిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో విభజన అనంతరం సెల్ ఫోన్ అమ్మకాలు పెద్దగా పెరగలేదు. తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలో వాటి ధర ఎక్కువగా ఉంది. దీంతో, ప్రభుత్వం వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే 14.5 శాతం వ్యాట్ విధించే వస్తువులన్నీ చట్టంలోని ఐదో షెడ్యూల్లో ఉన్నాయి. దీనిని ఇప్పుడు నాలుగో షెడ్యూల్లోకి తీసుకు రానున్నారు.

సగానికి పైగా కార్యాలయాలు తరలింపు
విజయవాడ, గుంటూరు నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించేందుకు ఇప్పటి వరకు 50 శాతానికి పైగా శాఖాధిపతుల కార్యాలయాలు హైదరాబాద్ నుంచి తరలి వెళ్లాయి. వెళ్లిన వాటిలో ఎక్కువ కార్యాలయాలు లాంఛనంగా నిర్దేశిత ముహూర్తానికి కొబ్బరికాయలు కొట్టినవే.
అక్కడ అద్దెకు తీసుకున్న భవనాలను తమ కార్యాలయాలకు అనువుగా మరమ్మతులు, మార్పు చేర్పులు చేయించుకుంటున్నారు. అవి పూర్తయ్యేందుకు మరికొంత సమయం పట్టనుందని చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి రాజధాని ప్రాంతానికి 102 శాఖాధిపతుల కార్యాలయాలు వెళ్లవలసి ఉంది. గత నెల 29 నుంచి 54 కార్యాలయాలు వెళ్లగా, విడతలవారీగా 48 కార్యాలయాలు వెళ్లనున్నాయి.
-
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!












Click it and Unblock the Notifications