పేలిన సెల్‌ఫోన్:బాలుడికి తృటిలో తప్పిన ముప్పు...పోలీసులకు ఫిర్యాదు
తిరుపతి:సెల్ ఫోన్ లు పేలిపోతున్న ఘటనలకు సంబంధించిన వార్తలు వినియోగదారులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. పైగా వీటిలో అత్యధిక భాగం ఛార్జింగ్ పెట్టే క్రమంలో పేలుతుండటంతో ఛార్జింగ్ పెట్టేందుకు భయపడిపోతున్నారు.
తాజాగా చిత్తూరు జిల్లా కాణిపాకంలో సోమవారం ఓ బాలుడి చేతిలో సెల్‌ఫోన్ పేలింది. ఫోన్ ఛార్జింగ్‌లో ఉండగా ఫోన్ వెనుక భాగం నుంచి పొగలు వస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించిన బాలుడు ఫోన్‌ను తీసుకొని దూరంగా విసిరేయడంతో పెద్ద శబ్దంతో ఫోన్ పేలిపోయింది. దీంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో బాలుడి కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

కొంచెం ఉంటే ఫోన్ బాలుడి చేతి లోనే పేలి ఉండేదని ఆందోళన వెలిబుచ్చారు. ఈ క్రమంలో బాధిత కుటుంబ సభ్యులు సదరు సెల్ ఫోన్ కంపెనీపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
More From
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications