వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎస్‌ను పిలిపించాలా?: కృష్ణ కిశోర్ వ్యవహారంలో ఏపీ సర్కారుపై క్యాట్ ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్). ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌కు బకాయిలు చెల్లింపులో జాప్యం ఎందుకవుతోందని ప్రశ్నించింది. అంతేగాక, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిలిపించాల్సి ఉంటుందని ట్రైబ్యునల్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు వెంటనే స్పందించింది. ఆయన వేతనం బకాయిలు హుటాహుటిన చెల్లించింది.

క్యాట్ ఆదేశించినా..

క్యాట్ ఆదేశించినా..

ఏపీ ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ కృష్ణ కిశోర్ దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర పారిపాలన ట్రైబ్యునల్(హైదరాబాద్) ఛైర్మన్ జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి, సభ్యుడు సుధాకర్‌తో కూడిన బెంచ్ శుక్రవారం మరోసారి విచారించింది.
రెండు వారాల్లో వేతనం బకాయిలు చెల్లించాలని డిసెంబర్ 24న ట్రైబ్యునల్ ఆదేశించినప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదని విచారణ సందర్భంగా కృష్ణకిశోర్ తరపు న్యాయవాది క్యాట్‌కు తెలిపారు.

సీఎస్‌ను పిలిపించాలా?.. ఏపీ సర్కారుపై క్యాట్ ఆగ్రహం..

సీఎస్‌ను పిలిపించాలా?.. ఏపీ సర్కారుపై క్యాట్ ఆగ్రహం..

ఈ క్రమంలో ప్రభుత్వం తీరుపై ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వేతనం ఇప్పటికీ చెల్లించకపోతే సీఎస్‌ను పిలిపించాల్సి ఉంటుందని హెచ్చరించింది. శుక్రవారం మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేసింది. దీంతో కృష్ణకిశోర్‌కు ఈరోజే(శుక్రవారం) వేతనం చెల్లించినట్లు మధ్యాహ్నం జరిగిన విచారణలో ఏపీ ప్రభుత్వ తరపు లాయర్ ప్రకాశ్ రెడ్డి క్యాట్‌కు తెలిపారు.

జాప్యం ఎందుకు?

జాప్యం ఎందుకు?

ఈ నేపథ్యంలో రెండు వారాల్లో వేతనం చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. కృష్ణకిశోర్‌కు వేతనం చెల్లించడంలో జాప్యం ఎందుకు జరిగిందని ఏపీ సర్కారును క్యాట్ ప్రశ్నించింది. జాప్యంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో తమకు కొంత సమయం కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. ఈ క్రమంలో తదుపరి విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి ట్రైబ్యునల్ వాయిదా వేసింది.

చంద్రబాబు హయాంలో ఏపీ ఆర్థిక మండలి సీఈవోగా..

చంద్రబాబు హయాంలో ఏపీ ఆర్థిక మండలి సీఈవోగా..

కాగా, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా కృష్ణ కిశోర్ పనిచేశారు. ఈ మండలికి సీఎం ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. అయితే, ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత కృష్ణ కిశోర్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేస్తున్నట్లు తాజా జగన్ జర్కారు ప్రకటించింది. అవినీతి ఆరోపణలతో శ్రీనివాస్ రెడ్డి అనే మరో అధికారిని కూడా సస్పెండ్ చేసింది. అంతేగాక, ఏపీ ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిశోర్‌పై సెక్షన్ 188, 403, 409, 120బీ కింద సీఐడీ కేసు నమోదు చేసింది. కృష్ణ కిశోర్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేయాలని సీఐడీ, ఏసీబీని ప్రభుత్వం ఆదేశించింది. ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

English summary
CENTRAL ADMINISTRATIVE TRIBUNAL fires at ap govt for krishna kishore salary issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X