ఏపీకి గుడ్ న్యూస్ - చంద్రబాబు అభ్యర్దనకు కేంద్ర ఓకే..!!

ఏపీకి కేంద్రం నుంచి మరో కీలక సమాచారం అందింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్దనకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత తొలిసారి ఏపీకి అదనపు ఐపీఎస్ ల కేటాయింపుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెంపు తరువాత పోలీసు అధికారుల సంఖ్య మరింత అవసరంగా మారింది. ముఖ్యమంత్రి ఈ మేరకు కేంద్రాన్ని అభ్యర్దించారు. ఏపీకి అదనంగా 30 మంది ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కొత్త ఐపీఎస్ లు
ఏపీకి భారీగా కొత్త ఐపీఎస్ లు రాబోతున్నారు. సీఎం చంద్రబాబు చేసిన అభ్యర్థన మేరకు కేంద్రం స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 144 మంది ఐపీఎస్ లను కేటాయించారు. అయినప్పటికీ పోలీసుల కొరత మాత్రం తీరలేదు. పైగా విభజన తర్వాత ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలు చేసింది. దీంతో పాటు నిఘా వ్యవస్థ విభాగాల్లో, క్రైం విభాగాల్లో పోలీసు అధికారుల కొరత తీవ్రంగా ఉంది. విభజన తర్వాత ఐపీఎస్ ల కొరతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం తమకు పోలీసు సిబ్బందిని ఎక్కువ మందిని కేటాయించాలని కేంద్రాన్ని కోరినా ఫలితంలేకపోయింది.

central Allotts 30 Additions IPS officers for AP Cadre and Chief Mister s request

చంద్రబాబు అభ్యర్దన
జగన్‌ కూడా కేంద్రానికి లేఖ రాశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలిసి రాష్ట్రంలో ఐపీఎస్ ల కొరత, ఇతర అంశాలపై ఆయనకు వివరించారు. పైగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత నాలుగైదు సంవత్సరాల అనుభవం ఉన్న జూనియర్‌ ఐపీఎ్‌సలను ఎస్పీలుగా నియమించాల్సి వస్తోంది. దీనివల్ల జిల్లాల్లో లా అండ్‌ ఆర్డర్‌ సమస్యలతో పాటు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను ప్రభుత్వం ఎదుర్కొంటోంది.

కేంద్రం ఆమోదం
ఈ విషయాలు మొత్తం అమిత్‌ షాకు చంద్రబాబు వివరించారు. సీఎం చంద్రబాబు విన్నపం మేరకు కేంద్ర హోం శాఖ ఏపీకి ఐపీఎ్‌సల సంఖ్య పెంచింది. 144 మంది ఐపీఎ్‌సలున్న కేడర్‌ స్ట్రెంత్ ను 174కు పెంచింది. దాదాపు 30 మంది ఐపీఎ్‌సలను అదనంగా కేటాయించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. డైరెక్టర్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 121 మంది ఐపీఎ్‌సలు ఏపీల్లో విధులు నిర్వహించనున్నారు. 53 మందికి పదోన్నతుల ద్వారా ఐపీఎ్‌సలు కానున్నారు. ఇందులో 38 మంది వరకూ సెంట్రల్‌ డిప్యుటేషన్‌పై పని చేసే అవకాశం కల్పించారు. 23 మంది వరకూ స్టేట్‌ డిప్యుటేషన్‌పై వచ్చేందుకు కేంద్రం అనుమతిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+