విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం తాజా నిర్ణయం..!!
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యవహారంలో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజులుగా ప్లాంట్ లో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ప్రయివేటీకరణ అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో కేంద్రం స్టీల్ ప్లాంట్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
మరో రూ 2,500 కోట్లు
విశాఖపట్నం స్టీల్ ప్లాంటుకు మరో రూ.2,500 కోట్లు ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటికే రూ.500 కోట్లు మంజూరు చేసింది. తొలుత విడుదల చేసిన నిధులను కేవలం చట్టబద్ధమైన చెల్లింపులకే వినియోగించాలని షరతు పెట్టింది. ఆ నిధుల వినియోగం బాధ్యత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కు అప్పగించింది. తాజాగా ప్రకటించిన రూ.2,500 కోట్ల వినియోగంలోనూ ఎస్‌బీఐ కీలకంగా వ్యవహరించాలని సూచించింది. ఈ నిధులు ఈ నెల 23వ తేదీ నాటికి అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చింది.

ఫర్నేసుల్లో ఉత్పత్తి
స్టీల్‌ప్లాంటులో మూడు బ్లాస్ట్ ఫర్నేసులు ఉండగా ముడి పదార్థాల కొరత కారణంగా రెండింటిని మూసేసి, ప్రస్తుతం ఒక్క దాంట్లోనే ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పుడు నిధులు అందుబాటులోకి వస్తున్నందున రెండు బ్లాస్ట్ ఫర్నేసులను పూర్తిస్థాయిలో నడపాలని ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అందుకు అవసరమైన ముడి పదార్థాలు సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. అన్ని విభాగాల్లోనూ నిర్వహణ (మెయింటెనెన్స్) పనులు చేపట్టి అక్టోబరు చివరి నాటికి పూర్తిచేసి, నవంబరు నుంచి పూర్తిస్థాయి ఉత్పత్తి చేయాలని కోరింది.
తర్జన భర్జన
స్టీల్ ప్లాంటులో మూడు బ్లాస్ట్ ఫర్నేసులకు రెండింటినే నడపాలని నిర్ణయించినందున అధికంగా ఉన్న ఉద్యోగులను ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలకు డిప్యుటేషన్‌పై పంపాలని నిర్ణయించింది. ఆ మేరకు జీతాల భారం తగ్గించుకోవాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఎన్‌ఎండీసీకి చెందిన నగర్‌నార్ ప్లాంటుకు డిప్యుటేషన్‌పై వెళ్లడానికి ఆసక్తి ఉన్నవారు ముందుకు రావాలని ఎగ్జిక్యూటివ్ స్థాయి అధికారులను మరోసారి పిలుపునిచ్చింది. దీనిపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications