ట్రంప్ ఆశలపై నీళ్లు.. ఇరాన్ సంచలన ప్రకటన!

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత హార్మజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు పున:ప్రారంభం కానున్న తరుణంలో ఇరు దేశాల మధ్య కొత్త వివాదం మొదలైంది. యుద్ధానికి ముందు ఉన్న పరిస్థితులు మళ్లీ వచ్చే ప్రసక్తే లేదని.. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల నుంచి తాము ఖచ్చితంగా టోల్ ఫీజు వసూలు చేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ ప్రధాన చర్చల ప్రతినిధి మహ్మద్ బాగెర్ గాలిబాఫ్ అధికారిక ప్రకటన చేశారు.

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ప్రకారం నిర్ణయించిన 60 రోజుల చర్చల గడువు ముగిసిన వెంటనే ఈ టోల్ విధానం అమలులోకి వస్తుందని ఇరాన్ ప్రకటించింది. హార్ముజ్ జలసంధిపై తమకు పూర్తి సార్వభౌమాధికారం ఉందని.. అక్కడ తాము అందించే సేవలకు గానూ రుసుము వసూలు చేసే హక్కు ఇరాన్‌‌కు ఉందని మహ్మద్ బాగెర్ గాలిబాఫ్ సమర్థించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మార్గాన్ని పూర్తిగా ఉచితంగా ఉంచుతామని ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఇరాన్ ఈ విధంగా ఎదురుదెబ్బ కొట్టడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

Iran Defies Donald Trump Announces Toll Fees for Ships Crossing the Strait of Hormuz Full Details

ఈ శాంతి ఒప్పందాన్ని అమెరికా వైఫల్యానికి నిదర్శనంగా ఇరాన్ అభివర్ణిస్తోంది. అమెరికా ఆంక్షల వల్ల నిరుపయోగంగా మారిన హార్ముజ్ జలసంధి సామర్థ్యాన్ని ఈ యుద్ధం ద్వారా తాము ప్రపంచానికి నిరూపించగలిగామని మహ్మద్ బాగెర్ గాలిబాఫ్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్‌‌పై దాడులు చేయడంతో ప్రారంభమైన ఈ 100 రోజుల యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, ఎల్ఎన్జీలో ఐదో వంతు ఈ వ్యూహాత్మక మార్గం గుండానే సాగుతుంది.

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిన వెంటనే చమురు రవాణా నౌకలు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించడం ప్రారంభించాయి. మూడు సౌదీ సూపర్ ట్యాంకర్లు దాదాపు 60 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతో ఈ మార్గం గుండా ప్రయాణించినట్లు తెలిసింది. యుద్ధ సమయంలో తమ ఉనికి దాచుకున్న పలు నౌకలు ఇప్పుడు పబ్లిక్ ట్రాకింగ్ సిస్టమ్స్ ద్వారా తమ ప్రయాణ వివరాలను వెల్లడిస్తున్నాయి. హార్ముజ్ జలసంధి మార్గం పూర్తిగా అందుబాటులోకి వస్తే ప్రపంచ మార్కెట్లోకి చమురు సరఫరా పెరిగి, అంతర్జాతీయం ముడి చమురు ధరలు తగ్గుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+