Bihar Gang Rape:భర్తను బంధించి భార్యపై అత్యాచారం - ప్రైవేట్ పార్ట్స్‌లో..!!
బీహార్ అంటే మొదటిగా గుర్తొచ్చేది అక్కడి నేరాలు ఘోరాలు. ముఖ్యంగా దొంగతనాలు, దోపిడీలు, హత్యాచారాలు,హత్యలు, దొంగల ముఠాలకు కేరాఫ్ అడ్రస్‌గా బీహార్ రాష్ట్రం మారింది. అంతేకాదు అక్కడ కాదని.. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇవే నేరాలకు పాల్పడుతున్నారు కొందరు బీహారీ దొంగలు. తాజాగా బీహార్ రాష్ట్రంతో పాటు యావత్ దేశం ఉలిక్కిపడే సంఘటన అక్కడ చోటుచేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఆ ఘటనతో బీహార్ ఒక్కసారిగా మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచింది.
మహిళపై సామూహిక అత్యాచారం
బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్‌లో అత్యంత దారుణమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఐదుగురు వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడి ఇంటి యజమానిని కట్టిపడేసి ఆయన భార్యపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆ మహిళా బాధితురాలిని హాస్పిటల్‌కు తరలించగా చికిత్స చేసే డాక్టర్లు షాక్‌కు గురయ్యారు.చికిత్స సందర్భంగా ఆమె ప్రైవేట్ పార్ట్స్ నుంచి ఒక బుల్లెట్, రాయి, మరో చెక్క ముక్కను బయటకు తీశారు. దీన్ని బట్టి చూస్తే ఆ దుర్మార్గులు ఎంతకు తెగించారో, ఏ రకంగా ఆ మహిళను లైంగిక హింసకు గురిచేశారో అర్థమవుతోంది.

జూన్ 11వ తేదీన జరిగి ఈ అత్యంత పాశవికమైన ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాకియా పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది.రాత్రి 11:30 గంటల సమయంలో బాధితురాలు వాష్‌రూంకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి చొరబడిన ఐదుగురు వ్యక్తులు తన భర్తను కట్టేసి ఓ గదిలో వేసి బంధించినట్లు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు.వాష్‌రూం నుంచి బయటకు వచ్చిన బాధితురాలిని అమాంతం లాక్కొని ఇంటి బయట ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై సామూహిక అత్యాచారం చేసినట్లు బాధితురాలు తెలిపింది.ఆమె గట్టిగా కేకలు వేసినప్పుడు నిందితులు తమతో తెచ్చుకున్న బ్లేడ్‌తో ఆమె ఛాతీపై తొడలపై కోసినట్లు వెల్లడించింది.
ప్రైవేట్ పార్ట్స్‌లో బుల్లెట్
అత్యాచారం చేసిన ఆ ఐదుగురు నిందితులు ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాధిత మహిళ తన వదినకు ఫోన్ చేయగా... వెంటనే అక్కడకు చేరుకుని ముందుగా బంధించబడిన తన భర్తను బయటకు తీసుకొచ్చి ఆమెను దగ్గరలోని బరౌనీ హాస్పిటల్‌కు ప్రాథమిక చికిత్స కోసం తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆమెను సదర్ హాస్పిటల్‌కు తరలించడం జరిగింది.చికిత్స అనంతరం తన ప్రైవేట్ పార్ట్స్‌లో తీవ్రమై నొప్పి ఉండగా మరోసారి హాస్పిటల్‌కు వెళ్లింది. అక్కడ మరిన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో బుల్లెట్, రాయి, ఒక చెక్క ముక్కను కనుగొని వాటిని తొలగించారు.అయితే ఘటన సమయంలో తను స్పృహ కోల్పోయినందున తనకేమి గుర్తులేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
మూడునెలల ముందు కూడా...
ఘటనకు మూడు నెలల ముందు కూడా ముగ్గురు వ్యక్తులు తమ ఇంట్లోకి చొరబడి ఆమెను కొట్టి డబ్బు నగలు దోచుకెళ్లారని, అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారని బాధిత మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే తాజా ఘటనపై స్పందించిన డీఎస్పీ ఆనంద్ కుమార్ పాండే శాస్త్రీయపరమైన విచారణ చేస్తున్నట్లు తెలిపారు. జూన్ 12వ తేదీన బాధిత మహిళ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని.. ఆమె అంతర్గత శరీర భాగాల్లో చాలా తీవ్రమైన గాయాలైనట్లు హాస్పిటల్ రిపోర్ట్స్ ద్వారా వెల్లడైందని డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పిన డీఎస్పీ... ఈ ఘటనలో ఉదాసీనతతో వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.













Click it and Unblock the Notifications