‘హిట్ మెషిన్’ అనిల్ రావిపూడి.. కింగ్ నాగార్జున క్రేజీ కాంబో ఫిక్స్
టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలుగు చిత్రసీమలో ఒక అరుదైన రికార్డుకు కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచారు. ఈ తరం దర్శకులకు సాధ్యంకాని రీతిలో, టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన 'నలుగురు పిల్లర్స్' అనబడే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో సినిమాలు చేసిన ఏకైక దర్శకుడిగా ఆయన సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. గతంలో కోడి రామకృష్ణ, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు వంటి దిగ్గజ దర్శకులకు మాత్రమే ఈ నలుగురు అగ్ర హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. ఇప్పుడు దశాబ్దాల తర్వాత మళ్లీ ఆ అరుదైన రికార్డును అందుకోబోతున్న ఏకైక మోడ్రన్ డైరెక్టర్‌గా అనిల్ రావిపూడి నిలవనున్నారు.
కెరీర్ ప్రారంభం నుంచి
కెరీర్ ప్రారంభం నుండి 'పటాస్', 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్' వంటి వరుస విజయాలతో కమర్షియల్ వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన అనిల్ రావిపూడి, ఇప్పటికే ముగ్గురు అగ్ర హీరోలతో పని చేసి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకున్నారు. విక్టరీ వెంకటేష్‌తో ఆయన చేసిన 'F2', 'F3' సినిమాలు బాక్సాఫీస్ వద్ద నవ్వుల పండగ తెచ్చాయి. ఇప్పటికే వెంకీతో నాలుగు సినిమాలు చేసిన అనిల్, ప్రస్తుతం తన ఐదో ప్రాజెక్ట్‌గా వెంకటేష్ - కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను పట్టాలెక్కిస్తున్నారు. మరోవైపు నటసింహం బాలకృష్ణ మార్క్ యాక్షన్‌కు తన మార్క్ హ్యూమర్‌ను జోడించి అనిల్ తెరకెక్కించిన 'భగవంత్ కేసరి' బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా, జాతీయ స్థాయిలో సైతం ప్రశంసలు అందుకుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ స్వాగ్‌ను పర్‌ఫెక్ట్‌గా వాడుకుంటూ అనిల్ రూపొందించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి, సౌత్ ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసింది.

ముగ్గురితో భారీ విజయాలు
ఇలా ముగ్గురు సీనియర్ స్టార్లతో భారీ విజయాలు అందుకున్న అనిల్ రావిపూడి ఖాతాలో మిగిలిపోయిన ఏకైక సీనియర్ స్టార్ అక్కినేని నాగార్జున మాత్రమే. తాజాగా ఈ క్రేజీ కాంబినేషన్‌పై అనిల్ రావిపూడి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఒక టీవీ ఛానల్ టాక్ షోలో అలనాటి నటి రాధతో మాట్లాడుతూ.. త్వరలోనే తాను నాగార్జునతో ఓ పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ అధికారిక ప్రకటనతో అక్కినేని అభిమానుల్లో ఆనందం ఒక్కసారిగా రెట్టింపయింది. కింగ్ నాగార్జునకు టాలీవుడ్‌లో బెస్ట్ కామెడీ టైమింగ్ ఉన్న హీరోగా మంచి పేరుంది. అయితే ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కువగా యాక్షన్, ఎమోషనల్ సబ్జెక్టులపైనే దృష్టి పెట్టారు తప్ప, ఆయనలోని పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌ను సరిగ్గా వాడుకున్న దర్శకులు లేరు. అనిల్ రావిపూడి బలం కూడా అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్ కావడం వల్ల, వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా నాగార్జున క్లాసిక్ హిట్స్ అయిన హలో బ్రదర్', ఘరానా బుల్లోడు, ఆవిడ మా ఆవిడే రేంజ్ వింటేజ్ వినోదాన్ని అందిస్తుందని ఫ్యాన్స్ గట్టిగా ఆశిస్తున్నారు. సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్న ఈ 'హిట్ మెషిన్'.. కింగ్‌తో కలిసి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాడో చూడాలి.












Click it and Unblock the Notifications