రామ్మోహన్ మంత్రాంగం - ఏపీకి కేంద్రం బిగ్ రిలీఫ్..!!
ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలవరం..అమరావతి సందర్శించారు. తన ప్రాధాన్యతలను స్పష్టం చేసారు. పోలవరం లో జరిగిన నిర్మాణ లోపాలను సరి చేసుకుంటూ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే నాలుగు సీజన్లు అవసరమని అధికారులు తేల్చి చెప్పారు. ఈ సమయంలో కేంద్రం జోక్యం కోరుతూ కేంద్ర మంత్రి రామ్మోహన్ మంత్రాంగం జరిపారు. దీంతో, కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
పోలవరం ప్రస్తుత పరిస్థితుల పైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర జలశక్తి అధికారులతో చర్చించారు. పోలవరంలో ప్రస్తుత నిర్మాణం కొనసాగించాలంటే ఉన్న ఇబ్బందులను పోలవరం అథార్టీ అధికారులతో కలిసి వివరించారు. దీంతో, కేంద్ర జలశక్తి కీలక నిర్ణయం తీసుకుంది. పోలవం సవాళ్లను పరిష్కరించేందుకు నలుగులు విదేశీ నిపుణులను ప్రాజెక్టుకు పంపుతున్నట్లు వెల్లడించింది. ఈ నలుగురు డ్యాం నిర్వహణ, భద్రత, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలుచ కట్టడాలకు సంబంధించిన అంశాల్లో నిపుణులు.

ఈ నలుగురు నిపుణుల టీం జూన్ 27 నుంచి జూలై 5 వరరకు పోలవరంలోనే మకాం వేసి ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నివేదిక ఇస్తారు. ఈ టీం మూడు నెలలకోసారి పోలవరం సందర్శిస్తారు. నిర్మాణం పూర్తయ్యే వరకూ సాంకేతికంగా అండదండలు అందిస్తారు. ప్రస్తుతం కాఫర్ డ్యాంలో అధిక సీవేజీ వస్తోంది. అది కట్టటం భవితవ్యానికి సవాలుగా ఉంది. ఫలితంగా ఈ కట్టడం ఆధారంగా చేసుకొనే పనులకు అవాంతరం ఏర్పడుతోంది. దీని పైన ఈ అంతర్జాతీయ నిపుణులు అద్యయనం చేసి ఇచ్చే నివేదిక ప్రాజెక్టు కొనసాగింపుకు కీలకం కానుంది.












Click it and Unblock the Notifications