చంద్రబాబు రిక్వెస్ట్ కు మోదీ ఆమోదం - బిగ్ రిలీఫ్..!!
ఏపీ కోసం కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం చేసిన అభ్యర్ధనకు ఆమోదం తెలిపింది. మూడో సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ విషయంలో మోదీ ప్రభుత్వం వరుస సానుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. అమరావతి - పోలవరం కు తమ వంతు సహకారం అంది స్తోంది. రైల్వే ప్రాజెక్టులు ... జాతీయ రహదారుల్లోనూ ప్రాధాన్యత పెంచింది. ఇక, ఇప్పుడు మరో సారి ఏపీ అడిగిన విధంగా మరో నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి భారీ రిలీఫ్ గా మారుతోంది.
ఏపీ కోరిన విధంగా
కేంద్రం పోలవరం విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాజెక్టు నిర్మాణం కోసం 2,705 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర జలశక్తి, ఆర్థికశాఖ ఆమోదం తెలిపాయి. దీంతో, ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలోనే పోలవరం కోసం కేంద్రం రూ. 5,512 కోట్ల రూపాయలను కేటాయించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి పోలవరం కోసం ఒకే ఆర్దిక సంవత్సరంలో కేంద్రం ఇంత మొత్తంలో నిధులు విడుదల చేసింది. కేంద్రం తాజాగా విడుదల చేసిన ఈ నిధులు త్వరలోనే ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి, అక్కడి నుంచి సింగిల్ నోడల్ ఖాతాకు చేరనున్నాయి. 2014 నుంచి ఇప్పటివరకు ఏ ఆర్థిక సంవత్సరంలోనూ ఇంత మొత్తంలో కేంద్రం నిధులు ఇవ్వలేదు.
పోలవరం కు నిధులు
కేంద్రం గతంలో మొదట రాష్ట్రప్రభుత్వం ఖర్చు చేస్తే ఆనక కేంద్రం రీయింబర్స్ చేసేది. కాగా, ఇప్పుడు మాత్రం కేంద్రం ఒక ఆర్దిక సంవత్సరంలోనే 5 వేల కోట్లకుపైగా అడ్వాన్ ఇచ్చింది. కేంద్రం మూడో సారి మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రూ 12 ,157 కోట్లు పోలవరం ప్రాజెక్టు అడ్వాన్స్ ఇచ్చేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. తర్వాత రూ.2,807 కోట్లు ఇచ్చింది. ఇందులో పాత బిల్లుల రీయింబర్స్మెంట్ కొంత అయితే రూ.2,348 కోట్లు అడ్వాన్స్ నిధులే. అందులో 75% నిధులు ఖర్చుచేసి ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే మరో విడత అడ్వాన్స్ నిధులు ఇస్తామని ప్రకటించింది. రెండోవిడత రూ.2,705 కోట్ల అడ్వాన్‌తో కేంద్రజలశక్తి శాఖ కు ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, ఆర్థిక శాఖలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

కేంద్రం ప్రాధాన్యత
కాగా, ఈ సమయంలో రూ.1,300 కోట్లే ఇచ్చేలా ఉత్తర్వులు సిద్ధమయ్యాయి. తిరిగి ఫైలు కేంద్ర జలశక్తికి చేరింది. ఈ సమయంలో కేంద్రంతో సంప్రదింపులు జరిపిన తర్వాత మళ్లీ ఆ ఫైలులో మార్పు వచ్చాయి. రూ.2,705 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వారంలోనే నిధులు రాష్ట్రానికి రానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.5,936 కోట్లు బడ్జెట్లో కేటాయించింది. ప్రస్తుత నిధులతో రానున్న ఆరు నెలల పాటు పోలవరం పనులకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నారు. పోలవరం - అమరావతి విషయంలో కేంద్రం ఏపీకి అందిస్తున్న సాయం తో .. ఏపీ ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు సిద్దం అవుతోంది. అమరావతి పనుల రీ లాంఛ్ కు ప్రధానిని ఆహ్వానించాలని నిర్ణయించారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ వార్ పై ప్రధాని సమీక్ష-చమురు, గ్యాస్, ఎరువులపై కీలక నిర్ణయాలు ? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications