చంద్రబాబుకు కష్ట కాలంలో మోదీ బిగ్ రిలీఫ్..!!
ఏపీకి కేంద్రం నుంచి బిగ్ అప్డేట్ అందింది. ఆర్దిక కష్టాల్లో ఉన్న ఏపీకి కేంద్రం తాజాగా నిధులు కేటాయించింది. మార్చి 3న ఏపీ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. కొత్త గా పథకాల అమలుతో పాటుగా ప్రాధాన్యత రంగాలకు నిధుల కేటాయింపులు చేయనుంది. ఏపీకి ఆర్దికంగా కష్టాలు వెంటాడుతున్న వేళ కేంద్ర సాయం కీలకంగా మారుతోంది. ఇప్పటికే అమరావతి తో పాటుగా రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇప్పుడు తాజాగా మరోసారి ఏపీకి నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర నిర్ణయంతో
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వరదల కారణంగా విజయవాడతో సహా పలు జిల్లా లు నష్టపోయాయి. ఈ ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి సాధారణ పరిస్థితులు కల్పించేందుకు మద్దతు గా నిలవాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. విజయవాడలో ముంపుకు గురైన ప్రాంతాల వారికి ఏపీ ప్రభుత్వం ఆర్దికంగా సాయం అందించింది. కేంద్రం నుంచి ప్రత్యేక టీంలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటన సమయంలోనూ కేంద్రంలోని మంత్రులకు చంద్రబాబు వరద నష్టం పైన నివేదికలు అందించారు.

ఏపీకి నిధులు
కేంద్ర హోం శాఖ తాజాగా దేశ వ్యాప్తంగా వరదలు, విపత్తులతో నష్టపోయిన రాష్ట్రాలకు ఎన్టీ ఆర్ఎఫ్ నుంచి నిధులు కేటాయించింది. అందులో భాగంగా ఏపీకి నిధులు విడుదల చేసింది,
విపత్తు, వరదల సాయం కింద ఐదు రాష్ట్రాలకు రూ.1,554.99 కోట్లు విడుదల చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిధుల్లో ఏపీకి అధికంగా రూ.608.08 కోట్లు విడుదల అయ్యాయి. అదే విధంగా తెలంగాణకు రూ.231 కోట్లు విడుదల చేసింది. ఇక.. త్రిపురకు 288.93 కోట్లు, ఒడిశాకు 255.24 కోట్లు కేటాయించగా... నాగాలాండ్‌కు రూ.170.99 కోట్లు విడుదల చేసారు.
ఆర్దిక సమస్యలు
ప్రస్తుత ఆర్దిక సంవత్సరం మరో నెల రోజుల్లో పూర్తి కానుంది. ప్రస్తుతం కేంద్రం వద్ద ఖర్చు కాని వివిధ శాఖల నిధులు దక్కించుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్రానికి ఆర్దికంగా ఏ అవకాశం ఉన్నా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. కొత్త ఆర్దిక సంవత్సరం ప్రారంభం తరువాత ఏపీకి ఆర్దికంగా కొంత వెసులుబాటు దక్కే అవకాశం ఉంది. దీంతో.. ఆ తరువాతనే నాడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు - పథకాల అమలుకు ప్రభుత్వం సిద్దం అవుతోంది. ఈ సమయంలో కేంద్రం నుంచి వచ్చిన నిధులు కీలక సమయంలో ఏపీ ప్రభుత్వానికి రిలీఫ్ ను ఇవ్వనున్నాయి.
-
ఏపీలో ఏకీకృత పెన్షన్ పథకం మార్గదర్శకాలు జారీ..! ఈ ఉద్యోగులకు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..! -
ఏపీ, తెలంగాణలో జనగణన - ఇవ్వాల్సిన వివరాలు, మార్గదర్శకాలు..!! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
End of Naxalism : ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన ఎర్రజెండా శకం.. -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications