మోదీ కేబినెట్ లోకి పురందేశ్వరి, టీడీపీ యువ ఎంపీ - ఆఇద్దరు ఔట్..!?
కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన కు ప్రధాని మోదీ సిద్దమయ్యారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా పార్టీలో.. ప్రభుత్వంలో కీలక మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు.. అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన వెంటనే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేయాలని డిసైడ్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి మార్పులు జరగనున్నాయి. ఏపీ నుంచి టీడీపీ, బీజేపీకి మరో మంత్రి పదవి దక్కనుంది. ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు చేయాలని నిర్ణయించారు.
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దిశగా కసరత్తు జరుగుతోంది. ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్ నాయుడుకు శాఖ మార్పులు జరగనున్నట్లు సమాచారం.కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురీతో పాటు పలువురు మంత్రులను పదవుల నుంచి తప్పించే అవకాశం కనిపిస్తోంది. రాజ్యసభ కు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్నికయినందున సీఎం పదవికి ఆయన ఏక్షణంలోనైనా రాజీనామా చేసే అవకాశం ఉంది. ఆయన స్థానంలో ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న నిత్యానంద రాయ్‌ను నియమించవచ్చునని సమాచారం. నితీష్ కుమార్‌కు కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా అవకాశం కల్పించనున్నారు. గతంలో వాజపేయి మంత్రివర్గంలో నితీష్ నిర్వహించిన వ్యవసాయ శాఖను ఆయనకు కేటాయించనున్నట్లు సమాచారం.

తెలుగు రాష్ట్రాల నుంచి కీలక మార్పులు
కాగా, తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న వారి శాఖల్లో మార్పులు ఖాయమైనట్లు సమాచారం. దివంగత నేత ఎర్రన్నాయుడు గతంలో నిర్వహించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖను ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడుకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కమ్యూనికేషన్ల శాఖలో సహాయమంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్‌కు స్వతంత్ర హోదా లభించవచ్చునని భావిస్తున్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు హరీశ్ బాలయోగి, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిలకు మంత్రివర్గంలో అవకాశం దక్కనున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. అయితే, ప్రస్తుతం ఏపీ నుంచి ముగ్గురు కేంద్ర మంత్రులు ఉన్నారు. టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు ఉండటంతో.. బీజేపీకి మరో పదవి ఇవ్వాలని భావిస్తున్నారు. కాగా, మిత్రపక్షాలు టీడీపీ- జనసేన నుంచి మరో మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. అందు లో భాగంగా సామాజిక లెక్కల మేరకు హరీష్ బాలయోగి వైపు చంద్రబాబు మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. అయితే, జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కావాలని కోరుకుంటే.. చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశం ఉంది.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications