Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశాఖ పై కేంద్రం స్పెషల్ ఫోకస్ - కీలక ప్రకటన..!!

విశాఖపై కేంద్రం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. విశాఖ కేంద్రంగా కేంద్రం నిధులు ప్రకటించింది.

విశాఖపై కేంద్రం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. విశాఖ కేంద్రంగా కేంద్రం నిధులు ప్రకటించింది. కొత్త ప్రాజెక్టులు అమలు చేస్తోంది. గ్లోబల్ పార్టనర్ షిప్ సమిట్ లో హాజరయ్యేందుకు వచ్చిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి.. సోనోవాల్ ఇద్దరూ విశాఖకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు.

ఇదే సదస్సు వేదికగా ముఖ్యమంత్రి జగన్ విశాఖ ఏపీ పరిపాలనా రాజధాని కాబోతోందని ప్రకటించారు. తాను త్వరలో విశాఖ నుంచి పాలన సాగిస్తానని వెల్లడించారు. ఏపీలో పారిశ్రామిక పురోగతికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారు. విశాఖకు సంబంధించి ప్రత్యేకంగా ప్రకటన చేసారు.

విశాఖ అభివృద్ధికి రూ 10 వేల కోట్లు

విశాఖ అభివృద్ధికి రూ 10 వేల కోట్లు

విశాఖ అభివృద్ధి కోసం రూ 10 వేల కోట్ల ప్రాజెక్టులు కేటాయించినట్లు కేంద్ర ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ ప్రకటించారు. పెట్టుబడి దారుల సదస్సులో పాల్గొన్న మంత్రి ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయిలో తోడ్పాటు ఇస్తుందని చెప్పారు.

రాష్ట్రంలో రూ 2,500 కోట్లు విలువైన 14 ప్రాజెక్టులకు ఆర్దిక సాయం అందిస్తున్నామని వివరించారు. విశాఖ అభివృద్ధికి ప్రధాని మోదీ రూ 10 వేల కోట్ల ప్రాజెక్టులను ఇటీవల కేటాయించారని గుర్తు చేసారు. మత్స్యకారుల ప్రగతికి సాగరమాల పథకం కింద రూ 1,500 కోట్లతో అయిదు ప్రాజెక్టులను మంజూరు చేసి నిధులను ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఆర్దిక సంవత్సరంలో విశాఖ ఓడరేవు కార్గో రవాణాలో 7.5 శాతం వృద్ధి రేటు ఉందని వివరించారు.

విశాఖలో 37 మిలియన్ టన్నుల రవాణా సామర్ధ్యం పెంచేలా రూ 1,250 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టులు చేపడుతున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు. రూ 97 కోట్లతో చేపట్టిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణం పూర్తయ్యే దశలో ఉందని మంత్రి సోనావాల్ పేర్కొన్నారు.

విశాఖ స్మార్ట్ సిటీకి రూ 3వేల కోట్ల ఖర్చు

విశాఖ స్మార్ట్ సిటీకి రూ 3వేల కోట్ల ఖర్చు

ఏపీ పారిశ్రామికంగా పురోగతి కోసం కేంద్రం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. రైల్వే బడ్జెట్ లో ఏపీకి కేంద్రం రూ 8,406 కోట్లు కేటాయించిందని గుర్తు చేసారు.విశాఖ, కాకినాడ, తిరుపతి,అమరావతి, విజయవాడ, గుంటూరులను స్మార్ట్ సిటీ కింద డెవలప్ చేస్తున్నామని వెల్లడించారు.

విశాఖపట్నం స్మార్ట్ సిటీ అభివృద్ధికి రూ 3వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. అంతులేని అవకాశాలు, నైపుణ్యం కలిగిన శ్రామికులు, ప్రతిభావంతులైన యువత, అపార సహజవనరులు ఏపీ సొంతమని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చిన పారిశ్రామిక వేత్తలను కిషన్ రెడ్డి అభినందించారు. రాష్ట్రంలోని ఆక్వా, ఔషధ, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం, ఇంజనీరింగ్ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని వివరించారు.

విశాఖే పాలనా రాజధానిగా..

విశాఖే పాలనా రాజధానిగా..

ఇదే సదస్సు వేదికగా తొలి రోజు ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటన చేసారు. రానున్న రోజుల్లో విశాఖ ఏపీ పాలనా రాజధానిగా ఉంటుందని చెప్పారు. త్వరలో తాను విశాఖ కు మకాం మారుస్తున్నట్లు మరోసారి స్పష్టం చేసారు. ఇప్పటికే రాజధానుల కేసుల సుప్రీం కోర్టులో ఉంది. ఈ కేసును త్వరగా విచారించాని ఏపీ ప్రభుత్వం సుప్రీంను కోరింది.

ఈ నెల 28న విచారించేందుకు సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ సమయం లోనే మరొసారి ఏపీలో రాజధాని వ్యవహరం చర్చకు వచ్చింది. కేంద్ర మంత్రులు..పారిశ్రామిక వేత్తల సమక్షంలోనే ముఖ్యమంత్రి జగన్ విశాఖ పాలనా రాజధాని కానుందని ప్రకటించారు. సుప్రీంలో విచారణ.. కోర్టు నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. ఇక, ఇప్పుడు విశాఖ కేంద్రంగా కేంద్రం ప్రత్యేకంగా ఫోకస్ చేయటం.. ప్రాజెక్టులు అమలు చేయటంతో విశాఖ మరింతగా అభివృద్ధికి అవకాశం కలుగుతోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+