కేంద్రం తేల్చి చెప్పేసింది- ఇక సీఎం జగన్ చేతిలో నిర్ణయం..!!

ఏపీకి సంబంధించిన అంశాలపై కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది. ఎన్నికల వేళ ఇప్పుడు కేంద్రం ప్రకటన మరోసారి రాజకీయ అంశంగా మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో, సీఎం జగన్ చేతిలో నిర్ణయం ఉంది. ఏపీ ప్రయోజనాల కోసం పోరాడుతామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు సీఎం ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారుతోంది.

పోలవరం సవరించిన అంచనాలను ఇవ్వాలని సీఎం జగన్ పదే పదే కోరినా....కేంద్రం ఆ అంశాన్నే ప్రస్తావించటం లేదు. చంద్రబాబు హయాం లో చేసుకున్న ఒప్పందం గురించే ఇప్పటికీ చెబుతూ వస్తోంది. దీనికి సంబంధించి రేపు (మంగళవారం) జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

హోదా అవకాశమే లేదు

హోదా అవకాశమే లేదు

ప్రత్యేక హోదా అంశంలో కేంద్రం గతంలో చెప్పిన విషయాలనే మరోసారి స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇప్పుడు ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్ర బోస్ ప్రశ్నకు కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. 14వ ఆర్దిక సంఘం సిఫార్సుల మేరకు 2015-20 మధ్య కాలంలో 32 శాతంగా ఉన్న రాష్ట్రాల పన్నుల వాటాను 42 శాతంకు పెంచిన అంశాన్ని మంత్రి గుర్తు చేసారు.

దీనికి కొనసాగింపుగా 15వ ఆర్దిక సంఘం కూడా 41 శాతం పన్నుల వాటా సిఫార్సు చేసిందని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు.ఈ మేర నిధులు అన్ని రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేస్తుందన్నారు. ఇంకా రెవిన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక రెవిన్యూ లోటు భర్తీ గ్రాంటు కింద ప్రత్యేకంగా సాయం అందిస్తున్నామని స్పష్టం చేసారు.

పోలవరం 2024 లోగా పూర్తి కాదు

పోలవరం 2024 లోగా పూర్తి కాదు

పోలవరం ప్రాజెక్టు వచ్చే ఎన్నికల్లోగా పూర్తి కావాల్సి ఉన్నా..సాధ్యపడే పరిస్థితులు లేవని కేంద్రం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి వైసీపీ ఎంపీ పిల్లి ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖా సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడే సమాధానమిచ్చారు. పనుల్లో వస్తున్న ఇబ్బందుల కారణంగా నిర్ణీత కాల వ్యవధి 2024 లోగా ప్రాజెక్టు పూర్తయ్య అవకాశం లేదని తేల్చి చెప్పారు.

జాతీయ ప్రాజెక్టుగా పోలవరం కు ఇప్పటి వరకు13,224.04 కోట్లు ఇచ్చినట్లుగా కేంద్ర వెల్లడించింది. అదే విధంగా ఏపీ ప్రభుత్వానికి 2,441.86 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఇరిగేషన్ కాంపోనెంట్ కింద 2016లో జరిగిన ఒప్పందం ప్రకారం నిధులు చెల్లిస్తున్నామని స్పష్టం చేసారు. అయితే, సీఎం జగన్ ప్రధానితో సహా కేంద్ర జలశక్తి మంత్రిని పదే పదే పునారావాసం తో పాటుగా సవరించిన నిధులు రూ 55 వేల కోట్ల మొత్తానికి ఆమోదం ఇవ్వాలని కోరుతూ వచ్చారు. కానీ, కేంద్రం ఇప్పుడు కూడా ఆ అంశం పరిగణలోకి తీసుకున్నట్లుగా కనిపించటం లేదు.

ముఖ్యమంత్రి చేతిలో నిర్ణయం...

ముఖ్యమంత్రి చేతిలో నిర్ణయం...

ఇప్పుడు ఏపీకి కీలకమైన ప్రత్యేక హోదా - పోలవరం విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వటంతో సీఎం ఏం చేస్తారనేది కీలకంగా మారుతోంది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని గతంలోనే సీఎం జగన్ స్పష్టం చేసారు. ఇక, పోలవరంకు సంబంధించి కొన్ని సందర్భాల్లో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు.

పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సమయంలోనూ నేరుగా ప్రధానిని కలిసి అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారో చెబుతానంటూ వ్యాఖ్యానించారు. ఇటు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కేంద్రం నుంచి పోలవరం పూర్తి నిధులు సాధించ లేకపోతే వైసీపీ పైన రాజకీయంగా ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తోంది.

2016లో ప్రత్యేక ప్యాకేజి పేరుతో చేసుకున్న ఒప్పందాన్నే కేంద్రం ప్రస్తావిస్తోంది. దీంతో..ఇప్పుడు సీఎం జగన్ ఎన్నికల్లో ప్రభావం చూపే ఈ కీలక అంశం పైన ఏ విధంగా ముందుకు వెళ్తారనేది రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+