మహిళలకు గుడ్ న్యూస్.. కేంద్రం కొత్త పథకం!
కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం మరో ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది. దేశంలోని అన్ని తపాలాశాఖ కార్యాలయాల్లో శనివారం నుంచి అమల్లో ఉంటుంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023 సందర్భంగా మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకాన్ని ప్రకటించారు. అన్ని తపాలాశాఖ కార్యాలయాల్లో అమల్లో ఉంటుంది. ఈ పథకాన్ని కేవలం మహిళల కోసమే ప్రభుత్వం ప్రకటించింది. బాలికలు కూడా ఇందులో చేరొచ్చు. భారతదేశంలోని 1.59 లక్షల తపాలాశాఖ కార్యాలయాల్లో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకం అమల్లో ఉంటుంది. బాలికలు, మహిళలకు ఆర్థికంగా స్వావలంబన కల్పించడంతోపాటు వారికి సాధికారతను అందించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
మహిళా సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ కింద రెండు సంవత్సరాల కాలానికి డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం రెండు సంవత్సరాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2025 మార్చి నెలవరకు సమయం ఉంటుంది. రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకంద్వారా ఎక్కువ వడ్డీ లభిస్తుంది. 7.5 శాతం వార్షిక వడ్డీని కేంద్రం ప్రకటించింది. మూడు నెలలకోసారి చక్రవడ్డీని లెక్కిస్తారు. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం కన్నా మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ వడ్డీ రేటు ఎక్కువ.

బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్లో డబ్బులు దాచుకోవాలనుకునేవారు, దానికన్నా ఎక్కువ వడ్డీ కోసం ఇందులో చేరవచ్చు. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్‌లో డబ్బులు దాచుకున్న తర్వాత పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బాలికల కోసం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అందిస్తోంది. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజనలో 7.6 శాతం వడ్డీ వస్తోంది. అయితే ఇందులో ప్రతీ నెలా డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ పథకంలో ఒకేసారి రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు.
సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఏటా గరిష్టంగా రూ.1,50,000 చేస్తుండగా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్ స్కీమ్ గరిష్ట పరిమితిని రూ.4,50,000 నుంచి రూ.9,00,000 కు పెంచారు. జాయింట్ అకౌంట్‌లో రూ.15,00,000 వరకు పొదుపు చేయడానికి అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications