జగన్ అడిగారు - మోదీ ఆమోదించారు: కూటమి కోరినా..నో..!!

ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ కూటమి ఎన్నికల బరిలోకి దిగింది. జగన్ కు మద్దతుగా ఉన్న అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కూటమి నేతలు ఎన్నికల సంఘానికి లేఖలు రాసారు. కొందరు అధికారులపై చర్యలు తీసుకున్నా, మఖ్యుల విషయంలో కూటమి కోరిన విధంగా చర్యలు లేవు. తాజాగా సీఎం జగన్ అభ్యర్ధనకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపటం ఎన్నికల వేళ కీలకంగా మారుతోంది.

ధర్మారెడ్డి కోసం జగన్ లేఖ
ఏపీలో జగన్ ను ఎదుర్కోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహకారం అవసరమని చంద్రబాబు భావించారు. అందులో భాగంగానే బీజేపీ కోరిన విధంగా సీట్లు కేటాయించారు. బీజేపీతో పొత్తు ఖాయం అయిన తరువాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాసారు. డీజీపీ, సీఎస్ తో పాటుగా పలువురి అధికారుల తీరు పైన ఫిర్యాదు చేసారు. వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరారు. కానీ, కీలక అధికారుల పైన ఎన్నికల సంఘం స్పందించకపోవటం కూటమి నేతలకు రుచించటం లేదు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ తాజాగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి డిప్యూటేషన్ కోరుతూ కేంద్రానికి లేఖ రాసారు. మరోమాట లేకుండా కేంద్రం ఆరు వారాల పాటు డిప్యుటేషన్ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Central Govt approves TTD EO Dharma Reddy Deputation Extension for Six weeks as CM Jagan Request

డిప్యుటేషన్ పొడిగింపు
ధర్మారెడ్డి డిప్యుటేషన్ మే 14తో ముగస్తుంది. కాగా, సీఎం జగన్ తాజాగా ఆయన డిప్యుటేషన్ పొడిగించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసారు. దీంతో, కేంద్రం ధర్మారెడ్డి పదవీ విరమణ చేసే సమయం జూన్ 30 వరకు డిప్యుటేషన్ పొడిగిస్తూ అనుమతి ఇచ్చింది. గతంలోనే ధర్మారెడ్డికి కేంద్రం రెండేళ్లు డిప్యుటేషన్ పొడిగించింది. ఈ జూన్ 30న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ లెక్కన మే 14న ఆయన కేంద్రానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాసారు. మే, జూన్ నెలల్లో సర్వదర్శనాల సమయం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఆ సమయంలో భక్తులకు సదుపాయాలు కల్పించటం సున్నితమైన అంశంగా వివరించారు. దీని కోసం ధర్మారెడ్డి కొనసాగింపుకు ఆమోదం తెలపాలని కోరారు.

Central Govt approves TTD EO Dharma Reddy Deputation Extension for Six weeks as CM Jagan Request

కూటమి నేతల్లో ఆగ్రహం
సీఎం కోరిన విధంగా కేంద్రం అమోదం తెలపటం కూటమి నేతలకు రుచించటం లేదు. ధర్మారెడ్డి పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కేంద్ర ఎన్నికల సంఘానికి గతంలోనే లేఖ రాసారు. ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా కొనసాగితే ఆ ప్రభావం ఎన్నికల పైన పడుతుందని ఫిర్యాదు చేసారు. ఆయన్ను తక్షణం బదిలీ చేయాలని కోరారు. కానీ, కేంద్ర రక్షణ శాఖ ఇప్పుడు ధర్మారెడ్డి ఈవోగా కొనసాగేందుకు డిప్యుటేషన పొడిగించేందుకు అనుమతి ఇచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ కోరిన విధంగా చేయటం..తాము చేసిన ఫిర్యాదుల పైన చర్యలు లేకపోవటం పైన కూటమిలో చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+