రైతులకు గుడ్‌న్యూస్.. ఈ కార్డుతో రూ.3లక్షల వరకు వడ్డీలేని రుణాలు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేస్తున్నాయి. వ్యవసాయం చేసే రైతులకే కాదు, వ్యవసాయ అనుబంధ రంగాల వారికి కూడా కేంద్రం అనేక పథకాలను అందిస్తూ వారి పురోగతికి దోహదం చేస్తుంది. ఇక కేంద్రం అందిస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లి ప్రజలకు ఉపయోగపడేలా చేస్తున్నాయి. ఇక కేంద్ర పథకాలను క్షేత్రస్థాయికి తీసుకు వెళ్లడంలో ఏపీ ప్రభుత్వం సక్సెస్ అవుతుంది.

పశు కిసాన్ క్రెడిట్ కార్డుతో రైతులు 3 లక్షల రూపాయల వరకు రుణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహకారంతో పాడి రైతులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని అందిస్తోంది. పశు పోషణ, దాణా కొనుగోలు వంటి అవసరాల కోసం రైతులు దీని ద్వారా తక్కువ వడ్డీకే బ్యాంకుల నుండి రుణాలను పొందే సౌకర్యాన్ని కల్పించింది. పశు కిసాన్ క్రెడిట్ కార్డుతో రైతులు 3 లక్షల రూపాయల వరకు రుణం తీసుకునేలా వెసులుబాటు కల్పించింది

Central Govt Pashu Kisan Credit Cards to support dairy farmers with loans up to rs 3 lakh

1.60 లక్షల రూపాయల వరకు ఎటువంటి పత్రాలు అవసరం లేకుండా మంజూరు

ఇందులో 1.60 లక్షల రూపాయల వరకు ఎటువంటి పత్రాలు అవసరం లేకుండా మంజూరు చేస్తారు. ఈ మొత్తాన్ని 40 రోజుల్లోగా తిరిగి చెల్లిస్తే దానిపైన వడ్డీ వర్తించదు. ఒకవేళ చెల్లించలేకపోతే ఆ తర్వాత ఏడు శాతం వడ్డీ తోటి చెల్లించాల్సి ఉంటుంది. అది మాత్రమే కాదు సంవత్సరంలోపు రుణం తిరిగి చెల్లించిన రైతులకు rbi నుండి, నాబార్డ్ నుండి మూడు శాతం వడ్డీ మినహాయింపు లభిస్తుంది.

పశు కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేయండి

ఆన్లైన్లో చెల్లింపులు చేసే అవకాశం కూడా ఈ కార్డుల ద్వారా అందుబాటులో ఉంటుంది. మరి ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాల రైతుల కోసం, ముఖ్యంగా పశువుల కోసం ఇచ్చే పశు కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తుకు సంబంధించిన వివరాల కోసం సమీప పశుసంవర్ధక శాఖ సహాయకులను సంప్రదించాలని చెబుతున్నారు.

పాడి రైతులు పశు కిసాన్ క్రెడిట్ కార్డుతో ఈ కేవైసీ తప్పనిసరి

అర్హత ఉన్న వారికి కార్డుతో పాటు పాస్బుక్ కూడా వారు అందజేస్తారని, ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ అని చెబుతున్నారు. అర్హులైన పాడిన రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులు కోరుతున్నారు. ఇక కిసాన్ క్రెడిట్ కార్డ్ ఈ కేవైసీ కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డులు, భూమి పత్రాలు, పశువుల ఆరోగ్య రికార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు సమర్పించాల్సి ఉంటుంది.

కిసాన్ క్రెడిట్ కార్డు బెనిఫిట్ పొందండి

మరి ఇంకెందుకు ఆలస్యం కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నవారు ఈకేవైసీ చేసుకోండి. లేనివారు కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని పొంది, కేంద్ర ప్రభుత్వం అందించే బెనిఫిట్ ను పొందే ప్రయత్నం చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+