ఏపీకి కేంద్రం కొత్త వరాలు - బడ్జెట్ లో ప్రకటన..!!

ఏపీకి త్వరలో కేంద్రం నుంచి గుడ్ న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా మారింది. తాజా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఏపీకి ప్రాదాన్యత దిశగా ఢిల్లీలో మంత్రాంగం సాగుతున్నట్లు సమాచారం. రానున్న అయిదేళ్ల కాలంలో ఏపీకి ఆర్దికంగా చేయూత ఇచ్చే విధంగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23న ప్రవేశ పెట్టే బడ్జెట్ లోనే ఏపీకి ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు ఉంటాయని చెబుతున్నారు.

కేంద్రంపై ఆశలు
ఈ నెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 23న కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. గత వారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఏపీకి ఆర్దికంగా చేయూత ఇవ్వాలని కోరారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రుణ పరిమితిని కూడా పెంచాలని కోరారు. దాదాపు ఏపీకి రానున్నఅయిదేళ్లకాలంలో లక్ష కోట్ల మేర ఆర్దిక సాయం కోరినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది.

Central hints package for Andhra Pradesh in up coming budget as Reports

ప్రాధాన్యత దక్కేలా
చంద్రబాబుకు ఈ సారి రాజధాని అమరావతితో పాటుగా పోలవరం ప్రాధాన్యత అంశాలుగా మారాయి. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ప్రత్యేకంగా గ్రాంట్లు ఇవ్వాలని కోరారు. అదే విధంగా రుణ సమీకరణ పరిమితి పెంచాలని కోరినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్దిక మంత్రితో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. రాజధాని అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పైన కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించారు. దీంతో పాటుగా విజయవాడ, విశాఖపట్నం, అమరావతిలో మెట్రో ప్రాజెక్టులు, లైట్ రైల్ ప్రాజెక్ట్ కోసం నిధులు కోరారు.

ప్యాకేజీపై నమ్మకం
ఇక.. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు.. రామాయపట్నం పోర్టు, ఇన్‌ఫ్రా ఉత్పత్తులు, కడపలో ఉక్కు కర్మాగారానికి ఆర్థిక సహకారం అందించాలని కేంద్ర మంత్రులను చంద్రబాబు అభ్యర్దించారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న ఆర్దిక పరిస్థితిని వివరించారు. ఈ సారి కేంద్రం ప్రవేశ పెట్టే బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యత దక్కుతుందని కేంద్ర వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ మేరకు ఏపీకి సంకేతాలు అందుతున్నాయి. దీంతో, అసలు బడ్జెట్ లో ఏపీకి కేంద్రం ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+