అమరావతి పై కేంద్రం కొత్త మెలిక - ఇక రాష్ట్రం పైనే భారం..!!
అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతి పనుల రీ లాంఛ్ ను అట్టహాసంగా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇప్పటికే టెండర్లు పూర్తి కావటంతో ఇక నిర్మాణాల పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. మూడేళ్ల కాలంలో నిర్మాణాలు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కేంద్రం సైతం ఇప్పటి వరకు అమరావతి కోసం సహకారం అందిస్తూ వస్తోంది. కాగా, ఇప్పుడు తాజాగా కేంద్రం మెలిక తో అమరావతి విషయంలో ఏపీ ప్రభుత్వం పైన భారం పడనుంది.
అమరావతి ఓఆర్ఆర్
2024 లో ఎన్నికల్లో గెలుపు తరువాత కేంద్రం ఏపీ రాజధాని అమరావతికి సహకారం అందిస్తోంది. అమరావతి పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. కాగా, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ విషయంలో కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వానికి హామీ లభించింది. 70 మీటర్ల వెడల్పుతో 189.4 కిలో మీటర్ల మేర 6 వరుసలతో అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్) ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ గత ఏడాది డిసెంబరు 20వ తేదీన ఆమోదం తెలిపింది. భవిష్యత్‌లో అమరావతిలో జనాభా పెరిగితే ఓఆర్‌ఆర్‌ను విస్తరిం ల్సి ఉంటుంది. దీంతో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 1వ తేదీన కేంద్రానికి లేఖ రాసింది. దీంతో 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణకు కేంద్ర ప్రభుత్వం సమ్మతించింది.

కొత్త మెలిక
కాగా, తొలుత ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదించినట్లు 70 మీటర్ల వెడల్పు కాకుండా, అదనంగా మరో 70 కలిపి మొత్తంగా 140 మీటర్ల భూసేకరణ చేయాలంటే అందుకయ్యే ఖర్చులో కొంత భరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. దీంతో వెయ్యి కోట్ల రూపాయలను వెచ్చించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. ఈ నిర్ణయంతో 140 మీటర్ల వెడల్పుతో అమరావతి ఓఆర్‌ఆర్‌కు భూసేకరణ జరగనుంది. అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణం నేపథ్యంలో విజయవాడ తూర్పు బైపాస్ ప్రతిపాదనను ఇప్పటికే పక్కనపెట్టారు. అమరావతి ఓఆర్‌ఆర్ ప్రాజెక్టు ఎలైన్ ట్‌కు మొదట ఆమోదం తెలిపినప్పుడు, మొత్తంగా 16,310 కోట్ల రూపాయల వ్యయమవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో 1,702 హెక్టార్లను సేకరించేందుకు 2,665 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని భావించారు.
ఏపీ ప్రభుత్వం పై భారం
ఇక.. ప్రస్తుతం 140 మీటర్ల వెడల్పుతో అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణం చేపడితే సుమారు 3,400 హెక్టార్లు అవసరమవుతుంది. అదే విధంగా దీనికి వ్యయం కూడా 5,200 కోట్ల రూపాయల వరకు పెరుగుతుంది. దీనిలో 1000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుం . ఇది రాష్ట్ర ప్రభుత్వానికి భారమైనా, అమరావతి ఓఆర్‌ఆర్ భవిష్యత్ దృష్ట్యా భరించేందుకు సిద్దం అయినట్లు సమాచారం. రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఓఆర్‌ఆర్‌తో అనుసంధానించేందుకు రెండు చోట్ల లింక్ రోడ్లు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.












Click it and Unblock the Notifications