అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీకి కేంద్రం రిలీఫ్ - నిధులు విడుదల : రెండు నెలల మొత్తం ఒకేసారి..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఆర్దిక కష్టాలతో సతమతం అవుతున్న ఏపీకి కేంద్రం కొంత ఊరట ఇచ్చింది. ఏపీకి రుణ పరిమితి పెంచాలని కోరుతూ కొంత కాలంగా ఏపీ ఆర్దిక మంత్రితో పాటుగా ఆర్దిక శాఖ అధికారులు ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా, తిరుపతిలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో సైతం గత ప్రభుత్వం చేసిన రుణాల కారణంగా..తమ ప్రభుత్వ పరిమితి పెంచకపోవటం పైన ముఖ్యమంత్రి జగన్ సమావేశంలో అభ్యంతరం వ్యక్తం చేసారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో సీఎం ఈ అంశాలను ప్రస్తావించారు. ఇక, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తాజాగా.. కేంద్ర పన్నుల రాబడి నుంచి ఏపీకి రావాల్సిన రూ.3,847.96 కోట్లను కేంద్రం విడుదల చేసింది.

రెండు నెలల చెల్లింపులు ఒకే విడతలో

రెండు నెలల చెల్లింపులు ఒకే విడతలో

రెండు నెలసరి వాయిదాలకు సంబంధించి 28 రాష్ట్రాలకు కలిపి రూ.95,082 కోట్ల నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. సాధారణంగా ఒక్కో నెలకు రూ.47,541 కోట్లు వంతున విడుదల చేయాల్సి ఉంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన 'పెట్టుబడులు, మౌలిక సౌకర్యాలు, అభివృద్ధి' అంశాలపై ఈ నెల 15న వర్చువల్‌ విధానంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు పన్నుల పంపిణీ ప్రక్రియలో భాగంగా ఈ నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ వివరించింది.

ఏపీకి ఆర్దిక కష్టాల్లో వెసులుబాటు

ఏపీకి ఆర్దిక కష్టాల్లో వెసులుబాటు

ఈ నిధుల్లో తెలంగాణకు 1,998.62కోట్లు విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు రూ.17,056.66 కోట్లు, అత్యల్పంగా గోవాకు రూ.367.02 కోట్లు విడుదలయ్యాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌కు రూ.1,670.58 కోట్లు, అసోంకు రూ.2,974.16 కోట్లు, బిహార్‌కు రూ.9,563.30 కోట్లు, చత్తీస్ గఢ్‌కు రూ.3,239.54 కోట్లు, గుజరాత్‌కు రూ.3,306.94 కోట్లు, హరియాణాకు రూ.1,039.24 కోట్లు, హిమాచల్‌ప్రదేశ్‌కు రూ.789.16 కోట్లు, ఝార్ఖండ్‌కు రూ.3,144.34 కోట్లు, కర్ణాటకకు రూ.3467.62 కోట్లు, కేరళకు రూ.1,830.38 కోట్లు మేర నిధులు కేటాయించారు

Recommended Video

3 Capital Bill Repeals : Vizag రాజధాని కోసం North Andhra డిమాండ్ || Oneindia Telugu
28 రాష్ట్రాలకు 95 వేల కోట్లు విడుదల

28 రాష్ట్రాలకు 95 వేల కోట్లు విడుదల

మధ్యప్రదేశ్‌కు రూ.7,463.92 కోట్లు, మహారాష్ట్రకు రూ.6,006.30 కోట్లు, మణిపూర్‌కు రూ.680.80 కోట్లు, మేఘాలయకు రూ.729.28 కోట్లు, మిజోరాంకు రూ.475.42 కోట్లు, నాగాలాండ్‌కు రూ.541.02 కోట్లు, ఒడిశాకు రూ.4,305.32 కోట్లు, పంజాబ్‌కు రూ.1,718.16 కోట్లు, రాజస్థాన్‌కు రూ.5,729.64 కోట్లు, సిక్కింకు రూ.368.94 కోట్లు, తమిళనాడుకు రూ.3,878.38 కోట్లు, త్రిపురకు రూ.673.32 కోట్లు, ఉత్తరాఖండ్‌కు రూ.1,063.02 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.7,152.96 కోట్లు విడుదల చేశారు.

English summary
The Center has given some leeway to the AP, which is struggling financially.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X