Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు ఆశలన్నీ అక్కడే - ఫలించేనా..!!

ఏపీలో భారీ వర్షాలు, వరదలు పెను నష్టాన్ని మిగుల్చాయి. ప్రాణ, ఆస్తి నష్టం భారీగా ఉంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రాధమికంగా రూ 6,500 కోట్ల మేర నష్టం జరిగినట్లు నివేదిక ఇచ్చింది. కేంద్రం నుంచి తక్షణ సాయం ఆశిస్తోంది. ఈ సమయంలోనే బృందాలు ఏపీలో రెండు రోజుల పాటు పర్యటించనున్నాయి. ఈ కమిటి నివేదిక ఆధారంగానే కేంద్రానికి సాయం అందనుంది.

కేంద్ర బృందాలు రాక
నేడు, రేపు ఏపీలో వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో నష్టం అంచనా వేస్తున్నారు. రెండు బృందాలుగా జిల్లాలకు.. దీంతో ఈ రోజుకు గృహ నష్టం అంచనా పూర్తి కావాలని కలెక్టర్లకు సిసోడియా ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్‌ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన బృందం ఏపీలో పర్యటించనుంది. రెండు టీమ్‌లుగా విడిపోయి కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు.

Central Teams to visit flood Affected areas in AP for two days

వరుస పర్యటనలు
ముందుగా తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు రాష్ట్ర అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా నేతృత్వంలో కేంద్ర బృందంతో భేటీ కానుంది. భేటీలో ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వరద నష్ట తీవ్రతను కేంద్ర బృందానికి సిసోడియా వివరించనున్నారు. కేంద్రం నుంచి వచ్చే అధికారుల్లో ఒక టీమ్‌ బుధవారం మధ్యాహ్నం 12.30 నుంచి 5.30 వరకు కృష్ణా జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది.

కేంద్రం పైనే ఆశలు
రెండో బృందం బాపట్ల జిల్లాలోని కొల్లూరు, వేమూరు, రేపల్లె, చెరుకుపల్లి మండలాల పరిధిలో పర్యటించనుంది. మధ్యాహ్నం యనమలకుదురులో గ్రామీణ నీటి సరఫరా స్కీమును బృందం పరిశీలించనుంది. పెద్దపులిపాక లోని దెబ్బతిన్న ఇల్లు, ఉద్యానవనం పంటలు, చోడవరంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించనుంది. అనంతరం దెబ్బతిన్న రొయ్యూరు కంకిపాడు రోడ్డును అధికారులు పరిశీలించనున్నారు. ఈ పర్యటన ద్వారా కేంద్రానికి ఇచ్చే నివేదిక ఆధారంగానే కేంద్రం ఏపీకి సాయం అందించనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం పైనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+