ఏపీ ప్రజలకు కేంద్రం మరో బంపర్ న్యూస్..! పర్యాటకులకు పండగే..

రాష్ట్ర పర్యాటక రంగానికి మహర్దశ పట్టబోతోంది. త్వరలోనే రాష్ట్రంలో మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు పట్టాలెక్కబోతున్నాయి. ఈ మేరకు ఇవాళ కేంద్ర పర్యాటక శాఖకు సమర్పించిన వివిధ ప్రాజెక్టుల డీపీఆర్ లను త్వరితగతిన ఆమోదించాలన్న మంత్రి కందుల దుర్గేష్ అభ్యర్థనకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు మంత్రి దుర్గేష్, ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలితో వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన క్లారిటీ ఇచ్చారు.

టూరిజానికి సాయం..

కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రసాద్, స్వదేశీ దర్శన్ 2.0, శాస్కి స్కీమ్ ల సహకారంతో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి జరుగుతుందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. వీటి సాయంతో త్వరలోనే నాగార్జున సాగర్, అహోబిలం, సూర్యలంకలో అభివృద్ధి పనులు మొదలుపెడతామన్నారు. అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులతో స్థానిక ప్రాంతాలు కొత్త రూపు సంతరించుకుంటాయన్నారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సాయంపై కృతజ్ఞతలు తెలిపారు.

centre agreed for approval to more tourism projects in andhra pradesh soon

కేంద్ర మంత్రి ఓకే..

స్వదేశీ దర్శన్ క్రింద అభివృద్ధి చేస్తున్న నాగార్జున సాగర్, అహోబిలం, సూర్యలంక ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ లను త్వరితగతిన ఆమోదించాలని మంత్రి దుర్గేష్ కోరగా... కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మరో వారం పది రోజుల్లో సంబంధిత ప్రక్రియ చేపడతామన్నారు. అలాగే విశాఖపట్టణం జిల్లా సింహాచలం ఆలయ అభివృద్ధి పనులు 60 శాతం పూర్తయ్యాయని, కాకినాడ జిల్లా అన్నవరం దేవాలయ అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కొన్నాళ్లు పనులు నిలిచిపోనున్నాయని మంత్రి దుర్గేష్ వివరించారు.

కేంద్రం సాయంతో వీటికి మహర్దశ

అలాగే స్వదేశ్ దర్శన్ 2.0 క్రింద బొర్రా గుహలు-లంబసింగి ప్రాజెక్టులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని దుర్గేష్ తెలిపారు. ఇప్పటికే బిడ్ వేశామన్నారు. శాస్కి స్కీమ్ క్రింద చేపడుతోన్న గండికోట ఫోర్ట్ కు సంబంధించిన టెండర్లు ఇప్పటికే స్వీకరించామన్నారు. పర్యాటకులకు సాహసోపేతమైన అనుభవాలను కల్పించేందుకు సర్వత్రా సిద్ధమవుతోందన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు అభివృద్ధి ప్రక్రియ ప్రస్తుతం టెండర్ దశలో ఉందని త్వరలోనే పట్టాలెక్కుతుందని వెల్లడించారు. అందులో భాగంగా పుష్కర్ ఘాట్, హేవలాక్ వంతెనల ఆధునికీకరణ చేపట్టనున్నామన్నారు.

centre agreed for approval to more tourism projects in andhra pradesh soon

ఈ ప్రాజెక్టులకు ఆమోదం..

ప్రసాద్ స్కీం క్రింద సింహాచలం ఆలయ అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని తెలుపుతూ ఇప్పటికే మంజూరైన రూ. 54.04 కోట్ల నిధుల్లో తొలి విడతగా రూ.13.69 కోట్లు వినియోగించామని, మిగిలిన 2,3వ విడత నిధులు త్వరతగతిన మంజూరు చేస్తే 5 నెలల్లో పనులు పూర్తవుతాయని కేంద్ర మంత్రికి మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గతేడాది 19 సెప్టెంబర్ న నెల్లూరు జిల్లాలోని వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించామని, వాటిని కూడా పరిశీలించి ఆమోదించాలని కోరారు. అలాగే మంగళగిరి, అరసవెల్లి దేవాలయాల ప్రతిపాదలను కూడా త్వరగా ఆమోదిస్తే రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి పరుగులు పెట్టిస్తామని తెలిపారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+