Parliament: ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్...ఈ ప్రాజెక్టులకు మహర్దశ..!
ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహకారంతో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఆనకట్టల పునరుద్ధరణ, అభివృద్ధి ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్‌లో 667 కోట్లతో 31 డామ్‌ల పునరుద్ధరణకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు వెల్లడించారు. పార్లమెంటు సమావేశాల తొలిరోజు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో ఆయన సమాధానం ఇచ్చారు. ఇందులో ఆయన కీలక విషయాలు వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో పునరుద్ధరించబోయే ప్రాజెక్టు వివరాలను కేంద్రమంత్రి వెల్లడించారు. ఇందులో డ్రిప్ ఫేజ్ II కింద శ్రీశైలం, సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజ్, రావాడ రిజర్వాయర్, ఎర్ర కాలువ, ఏలేరు రిజర్వాయర్, పంపా రిజర్వాయర్. గుండ్లకమ్మ రిజర్వాయర్, రాళ్లపాడు ప్రాజెక్టు, సోమశిల రిజర్వాయర్, తమ్మిలేరు ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే డ్రిప్ ఫేజ్ III కింద మరికొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి.

ఇందులో గొట్టా బ్యారేజీ, తాటిపూడి రిజర్వాయర్, కోనాం రిజర్వాయర్, ఆండ్ర రిజర్వాయర్, పెద్దేరు రిజర్వాయర్, కొవ్వాడ కాలువ ప్రాజెక్టు, జీఎంటీ జల్లేరు రిజర్వాయర్, ఆవుకు రిజర్వాయర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, భైరవానితిప్ప ప్రాజెక్టు, వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గాజులదిన్నె సంజీవయ్య సాగర్ ప్రాజెక్ట్, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, శ్రీ కోట్ల విజయభాస్కర రెడ్డి సుంకేసుల ప్రాజెక్టు, బ్రాహ్మణ సాగర్, వెలిగల్లు ప్రాజెక్టు, మైలవరం రిజర్వాయర్, చెన్నరాయస్వామి గుడి ప్రాజెక్టు, మిడ్ పెన్నార్ స్టేజ్ I, పెన్నా అహోబిలం ప్రాజెక్టు ఉన్నాయి.
కేంద్రం ఆమోదించిన మొత్తం 31 ప్రాజెక్టుల్లో సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజ్, శ్రీశైలం ప్రాజెక్టు, రైవాడ రిజర్వాయర్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరణ ప్రణాళికలను రూపొందించి ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ఆమోదం కోసం సెంట్రల్ వాటర్ కమిషన్‌కు సమర్పించినట్లు మంత్రి తెలిపారు. మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించి ప్రాజెక్టు స్క్రీనింగ్ టెంప్లేట్స్ తయారు చేయాల్సి ఉందని అన్నారు. డ్రిప్ ప్రోగ్రాం కింద పునరుద్ధరణ కోసం డామ్‌లను ఎంపిక చేసే బాధ్యత ఆయా రాష్ట్రాలు, ప్రాజెక్టును అమలు చేసే ఏజన్సీలదేనని మంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications