Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరం.. మరో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే

026 కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రెండు రాష్ట్రాలకు మరో మరో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేను మంజూరు చేసింది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది. ఏఏ ప్రాంతాలను కలుపుతుంది. ఎంత ప్రయాణ సమయం కలిసి వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం

కేంద్ర ప్రభుత్వం 2025 డిసెంబర్ 31న జరిపిన చివరి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాతీయ రహదారి -326 విస్తరణకు ఆమోదం తెలిపింది. దీని వల్ల గజపతి, రాయగడ కోరాపుట్ లలో ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని కేంద్రం భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఉపాధి అవకాశాలతో పాటు, టూరిజం బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే పారిశ్రామిక ప్రగతికి కూడా తొడ్పడుతుందని, గిరిజన ప్రాంతాలలో సమ్మిళిత అభివృద్ధిని వేగవంతం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది.

మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ.. నేషనల్ హైవై -326 ప్రధానమంత్రి గతిశక్తిలో భాగంగా.. ఆరు లేన్లగా మారబోతుంది. ఇద నాసిక్-సోలాపూర్-అక్కల్‌కోట్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్తో అనుసంధానం కాబోతుంది. మూడు రాష్ట్రాల మధ్య అతి పెద్ద కనెక్టివిటీని పెంచడంతో పాటు రవాణాను మరింతగా బలోపేతం చేస్తుందని లాజిస్టిక్స్‌ను పెంచుతుందని కేంద్రం చెబుతోంది.

Centre Approves New Greenfield Expressway with NH 326 six lane project for Andhra Pradesh and Telangana Ahead of 2026

తెలంగాణకు తగ్గనున్న దూరం..

గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే తో ఏపీ నుంచి తెలంగాణాకు ఉన్న 201 కిలోమీటర్లు దూరం సగానికి సగం తగ్గుంది. ఇక దీని వల్ల కోప్పర్తి, ఓర్వకల్ వంటి జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి జరుగుతుంది. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే మీద గంటకు 100 కిలో మీటల వేగంతో వెళ్లేలా రూపకల్పన చేస్తున్నారు. ఫలితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు సాధారణ ప్రయాణం కూడా సాగిపోతుంది

ఏపీకి పెరగనున్న కనెక్టివిటీ

ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏపీలో కీలక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని కేంద్రం అంచనా వేస్తుంది. ప్రస్తుతం చెన్నై నుంచి తిరువల్లూరు, రేణిగుంట, కడప, కర్నూలు మీదుగా మహారాష్ట్ర సరిహద్దులలోని హసాపూర్‌ వరకు నాలుగు-లేన్ల కారిడార్ నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక కేంద్రం తాజాగా ఆమోదించిన ఆరు-లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే తో ఏకంగా ఏపీ నుంచి తెలంగాణాకు ప్రయాణ సమయాన్ని సగానికి పైగా తగ్గిస్తుందని అంచనా. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే మహారాష్ట్రలో 374 కిలోమీటర్లు ఉంటుంది. రూ. 9,142 కోట్లు అంచనా వ్యయం. దీనిని బీవోటీ విధానంలో చేపట్టనున్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే తో నాసిక్, అహల్యనగర్, సోలాపూర్ వంటి ముఖ్యమైన నగరాలను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుతో కనెక్ట్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+