ఈ రోజు విశాఖ ఉక్కుపై పడ్డారు , రేపు సింగరేణి , బీహెచ్ఈఎల్ పై పడతారు : కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోమారు విశాఖ ఉక్కు కర్మాగారం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొన్నటికి మొన్న విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో తాము కార్మికుల పక్షాన నిలుస్తామని, అవసరమైతే ఏపీకి వెళ్లి మరీ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తామని చెప్పిన కేటీఆర్ తాజాగా బేగంపేటలోని హరిత ప్లాజా హోటల్ లో తెలంగాణ ఐకాస సమితి సదస్సులో పాల్గొన్నారు.ఈ సదస్సులో అనేక కీలక అంశాలపై మాట్లాడిన మంత్రి కేటీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .

నువ్వెవరు అడిగేందుకు .. ఏపీ తో నీకేం పని అంటున్నారని కేటీఆర్ అసహనం

నువ్వెవరు అడిగేందుకు .. ఏపీ తో నీకేం పని అంటున్నారని కేటీఆర్ అసహనం

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో నువ్వెవరు అడిగేందుకు .. ఏపీ తో నీకేం పని అంటున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ దేశంలో లేదా ? మేం మాట్లాడకూడదా ? అంటూ ప్రశ్నించిన మంత్రి కేటీఆర్ ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్ముతున్నారు. రేపు సింగరేణి, బీహెచ్ఈఎల్ పై కూడా పడతారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ కష్టమొచ్చింది కదా.. మాకేంటి సంబంధం అని నోరు మెదపకుండా ఉంటే ఎలా .. రేపు మనకూ ఆ కష్టం రావచ్చు , మనకు కష్టమొస్తే అప్పుడు మనతో ఎవరుంటారు అంటూ ప్రశ్నించారు.

 బయ్యారం ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయలేదని మండిపడిన కేటీఆర్

బయ్యారం ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయలేదని మండిపడిన కేటీఆర్

బయ్యారంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయలేదని ఐటి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కె. తారక రామారావు మోడీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు . విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (వి.ఎస్.పి) లో 100 శాతం పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. శుక్రవారం గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికలకు ముందు జరిగిన సమావేశంలో ప్రసంగించిన కెటిఆర్, ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగితే తెలంగాణ మౌనంగా ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణలోని ఈసిఐఎల్, బీహెచ్ఈఎల్ , సింగరేణి గనులు, మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా కేంద్రం ప్రైవేటీకరించవచ్చని ఆయన ఆరోపించారు.

 ఎవరికో కష్టమొచ్చింది మనకెందుకులే అనుకుంటే తప్పన్న మంత్రి కేటీఆర్

ఎవరికో కష్టమొచ్చింది మనకెందుకులే అనుకుంటే తప్పన్న మంత్రి కేటీఆర్

ఎవరికో కష్టమొచ్చింది మనకెందుకులే అనుకుంటే తప్పని పేర్కొన్న కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏపీలో భాగమని అన్నారు. మొదట మనం అందరం భారతీయులం అని, ఆ తర్వాతే తెలంగాణ బిడ్డలమని చెప్పుకొచ్చారు. దేశంలో ఎక్కడ తప్పు జరిగినా అందరూ ఖండించాలని పేర్కొన్న కేటీఆర్ , కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పై విరుచుకుపడ్డారు. గతంలో 2003లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను మోడీ విమర్శించారని, సిలిండర్ కు దండం పెట్టి ఓటేయాలని అడిగారని, ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేటీఆర్ స్పందనపై ప్రతిపక్షాల ఎటాక్ .. అందుకే మరోమారు వివరణ

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేటీఆర్ స్పందనపై ప్రతిపక్షాల ఎటాక్ .. అందుకే మరోమారు వివరణ

బీజేపీకి ఓటేస్తే ధరల పెరుగుదలకు ఆమోదం తెలిపినట్టు అవుతుందని పేర్కొన్న కేటీఆర్, రాష్ట్రంపై వివక్ష చూపుతున్న పార్టీకి ఎందుకు ప్రాధాన్యతనివ్వాలో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో మంత్రి కేటీఆర్ స్పందించడంతో, ప్రతిపక్ష పార్టీలు కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించే దిక్కులేదు కానీ పక్క రాష్ట్రానికి వెళ్ళి సమస్యలు పరిష్కరిస్తారా అంటూ ఎద్దేవా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో మరోమారు స్పందించారు. ఏపీకి వచ్చిన కష్టం రేపు మనకు కూడా రావచ్చు అంటూ కేంద్రం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+