andhra pradesh centre visakhapatnam jagan railways piyush goyal ysrcp parliament capital ఆంధ్రప్రదేశ్ కేంద్రం విశాఖపట్నం జగన్ పీయూష్ గోయల్ వైసీపీ పార్లమెంట్ రాజధాని politics
జగన్‌కు కేంద్రం షాక్ -చంద్రబాబును అడ్డంపెట్టి రైల్వే బాంబు -ఏపీ సర్కార్ దివాళా! -విశాఖ ఐటీఐఆర్ వెనక్కి
వరుసగా పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీలతో గెలిచి ఊపుమీదున్న సీఎం జగన్ కు కేంద్రంలోని మోదీ సర్కారు భారీ షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో రైల్వే ప్రాజెక్టులు, కొత్త కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో 'ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్టిమెంట్ రీజియన్ (ఐటీఐఆర్)' ప్రాజెక్టు సహా ఇతర కీలక అంశాలపై సంచలన ప్రకటన చేసింది. ఏపీ అభివృద్ధి విషయంలో కేంద్రానికి నాటి చంద్రబాబు హయాంలో దక్కిన సహకారాన్ని జగన్ కొనసాగించడంలేదని పార్లమెంట్ సాక్షిగా పేర్కొంది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో మరో కొత్త పార్టీ! -కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన ప్రకటన -కారు, కమలానికి దీటుగా?

విశాఖ ఐటీఐఆర్ వెనక్కి
ఏపీకి కొత్త కార్యనిర్వాహక రాజధానిగా భావిస్తోన్న విశాఖపట్నంలో ఐటీ రంగం విస్తృతికి ఎంతగానో దోహదపడే ‘‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్టిమెంట్ రీజియన్ (ఐటీఐఆర్)'' ప్రాజెక్టు ఇక కలగానే మిగిలిపోనుంది. దేశంలో ఐటీ రంగం విస్తరణ కోసం మన్మోహన్ సర్కారు తీసుకొచ్చిన ‘ఐటీఐఆర్ విధానం-2008'ని ప్రస్తుత మోదీ సర్కారు రద్దు చేసిన దరిమిలా విశాఖపట్నంలో ఐటీఐఆర్ ఏర్పాటు కాబోదని కేంద్రం కుండబద్దలు కొట్టింది. దీనిపై..
తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ లేదా శ్రీనివాసులు -పవన్ పరిస్థితేంటి? -చింతాకే కాంగ్రెస్ టికెట్!

ఎంపీ రఘురామ ప్రశ్నతో..
విశాఖలో ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సంబంధించి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే బుధవారం సమాధానమిచ్చారు. విశాఖ ఐటీఐఆర్ ప్రతిపాదనలను 2018 ఫిబ్రవరి 16నే ఏపీ ప్రభుత్వానికి తిప్పి పంపామని, ఇదే విషయమై ఏపీ నుంచి మళ్లీ ఎలాంటి ప్రతిపాదనా రాలేదని మంత్రి స్పష్టం చేశారు. ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్, స్మార్ట్‌సిటీ మిషన్, ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్‌లాంటి పథకాల ద్వారా పారిశ్రామికాభివృద్ధికి అనుకూల వాతావరణాన్ని కల్పించినందున ఐటీఐఆర్ విధానం అమలు చేయాల్సిన అవసరం లేదని కేంద్రం నిర్ణయించినట్లు ధోత్రే వివరించారు. కాగా, జగన్ సర్కారుకు భిన్నంగా, తెలంగాణలోని కేసీఆర్ సర్కారు మాత్రం హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయం మీరే చూపాలంటూ కేంద్రాన్ని కోరుతున్నది. ఇదిలా ఉంటే

ఏపీ రైల్వే ప్రాజెక్టుల్లోనూ అదే తీరు
విశాఖలో ఐటీఐఆర్ విషయంలో జగన్ సర్కారు నుంచి మరోసారి ప్రతిపాదనేదీ రాలేదన్న కేంద్రం.. రాష్ట్రంలో చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టుల విషయంలోనైతే భారీ బాంబు పేల్చింది. అన్ని రకాలుగా దిగజారిన ఏపీ ఆర్థిక పరిస్థితిని ఎత్తిచూపుతూ రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సంచలన ప్రకటనచేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా జగన్ సర్కారు తన వాటా నిధులను సమకూర్చలేమని చెబుతున్న కారణంగా ఏపీలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం డోలాయమానంలో పడినట్లు గోయల్ పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్ పై చర్చలో భాగంగా అటు రాజ్యసభలో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, ఇటు లోక్ సభలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ గోయల్ ఈ వ్యాఖ్యలు చేశారు. తద్వారా..

చంద్రబాబు హామీ.. జగన్ వెనుకడుగు..
ఏపీలో చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టుల విషయంలో తాత్సారానికి కారణం జగన్ సర్కారే అని పేర్కొన్న కేంద్రం.. నాటి చంద్రబాబు సర్కారు ఇచ్చిన సహకారాన్ని గుర్తు చేయడం గమనార్హం. ‘‘ఆంధ్రప్రదేశ్ లో చేపట్టే రైల్వే పనుల వ్యయంలో 50% భరిస్తామని 2015లో అప్పటి చంద్రాబాబు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంతేకాదు, తన వాటా కింద రూ.200 కోట్లు భరించాల్సి ఉండగా 2016-17లో రూ.50 కోట్లు డిపాజిట్ చేసింది. కానీ ఆ తర్వాతి నుంచి నిధులేమీ ఇవ్వలేదు. ప్రభుత్వం మారిన తర్వాత.. ఆర్థిక పరిమితుల దృష్ట్యా తమ వంతు వాటా సమకూర్చలేమని చెప్పారు. ఈ మేరకు జగన్ సర్కారు 2019-20లో క్లారిటీ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల కొన్ని రైలు మార్గాలను సొంత నిధులతోనే చేపట్టాలని రైల్వేశాఖ నిర్ణయించిందని పీయూష్ గోయల్ వివరించారు. ఇదిలా ఉంటే..

ఇంటర్నెట్ వాడకంలో ఏపీ టాప్
ఏపీలో రైల్వే ప్రాజెక్టులు, విశాఖలో ఐటీఐఆర్ రద్దు లాంటి షాకింగ్ ప్రకటనలు చేసిన కేంద్రం.. రాష్ట్రంలో ఇంటర్నెట్ వాడకంపైనా కీలక ప్రకటన చేసింది. గ్రామీణ ప్రాంత ఇంటర్‌నెట్ చందాదారుల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచిందని, దేశవ్యాప్తంగా 2020 నాటికి గ్రామాల్లో 30.2 కోట్ల మంది చందాదారులు ఉండగా ఏపీలో 2.66 కోట్ల మంది ఉన్నట్లు కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి సంజయ్‌ధోత్రే బుధవారం లోక్‌సభలో తెలిపారు. ఏపీ కంటే ముందు యూపీ(4.5 కోట్లు), బిహార్(3.2 కోట్లు), మహారాష్ట్ర(2.68 కోట్లు) ఉన్నాయన్నారు. భారత్‌నెట్ కార్యక్రమం కింద ఏపీలో 1,707, తెలంగాణలో 2,047 గ్రామపంచాయతీలకు ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించామని మంత్రి పేర్కొన్నారు.