ఎపి రాజధానిపై కమిటీ వివరాలు ఇచ్చింది: వెంకయ్య
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణన్ కమిటీ వివరాలను ఇచ్చిందని కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. రైళ్లు, మెట్రో రైలు, రోడ్లు, ఇతర ప్రాంతాలతో అనుసంధానం వంటి విషయాల్లో కేంద్రం సహాయం చేస్తుందని ఆయన బుధవారం చెప్పారు.
కనీస సౌకర్యాలు లేనందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొన్ని మెడికల్ సీట్లను కోల్పోయిందని, ఈ విషయంపై తాము ఎంసిఎతో మాట్లాడుతున్నామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుపై ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడినట్లు ఆయన తెలిపారు.

ఇదిలావుంటే, విజయవాడ, గుంటూర పరిధిలో అన్ని వనరులూ ఉన్నాయని, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గడ్ తరహాలో రాజధానిని నిర్మించుకోవచ్చునని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సుధీర్ కృష్ణ అన్నారు. బుధవారం ఆయన విజయవాడలో అధికారులతో సమావేశమయ్యారు.
భేటీలో విజయవాడ, గుంటూరు అభివృద్ధికి సంబంధించి వివిధ అంశాలపై చర్చించామని, మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం సాధ్యాసాధ్యాలను పరిశీలించామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications