పిన్నెల్లి ఎపిసోడ్ పై ఎన్నికల సీఈవో కీలక ఆదేశాలు..!!
ఏపీలో ఇప్పుడు వైసీపీ నేత పిన్నెల్లి వ్యవహారం కలకలంగా మారుతోంది. ఇప్పటికే పోలీసులు పిన్నెల్లి కోసం గాలిస్తున్నారు. ఈ వ్యవహారం రాజకీయ దుమారంగా మారుతోంది. అటు మాచర్ల వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక..మాచర్ల తాజా పరిస్థితుల పైన ఎన్నికల ప్రధానాధికారి మీనా కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం చేసిన చోట విధుల్లో ఉన్న అధికారుల పై చర్యలకు ఆదేశించారు.
పిన్నెల్లి అరెస్ట్ కోసం
మాచర్ల పరిధిలో వైసీపీ నేత పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేయటాన్ని ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనలో విధుల్లో ఉన్న పిఓ, ఏపిఓ లను సస్పెండ్ చేయమని ఆదేశాలు ఇచ్చినట్లు సీఈవో మీనా చెప్పుకొచ్చారు. ఘటనపై సమాచారం ఇవ్వనందుకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు. పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు హైదరబాద్ లో అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ, నలుగురు సర్కిల్ ఇన్స్ పెక్టర్ లతో బృందాలు పని చేస్తున్నాయని చెప్పారు. మాచర్లలో టీడీపీ నేతల పర్యటన ఈ సమయంలో సరికాదన్నారు. అక్కడ ఇప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తోందని..టీడీపీ నేతలు వెళ్తే వైసీపీ నేతలు వెళ్తామని అంటారని పేర్కొన్నారు. అప్పుడు మళ్లీ పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని చెప్పారు.

మాచర్లకు అనుమతించం
బయటి నాయకులు ఎవ్వరూ పరామర్శకు వెళ్లకూడదని స్పష్టం చేసారు. ఎవ్వరినీ ఆ గ్రామాల్లోనికి వెళ్లనీయవద్దని నేను ఇప్పటికే సూచించామన్నారు. పాల్వాయి పోలింగ్ స్టేషన్ లో ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకకృష్ణారెడ్డి ఇవిఎం ధ్వసం చేసిన విజువల్స్ ఎన్నికల కమీషన్ నుండి బయటకు వెళ్లలేదని సీఈఓ స్పష్టం చేసారు. పోలీస్ దర్యాప్తులో వీడియో ఎక్కడ, ఎవరి నుంచి బయటకు వెళ్లిందో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో అన్ని జిల్లాల అధికారులకు కౌంటింగ్ ఏర్పాట్ల పైన మీనా దిశా నిర్దేశం చేసారు.ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరితగిన ప్రకటించేలా అన్ని ముందస్తు ఏర్పాట్లు ప్రణాళికా బద్దంగా చేసుకోవాలని సూచించారు.
కౌంటింగ్ పై సూచనలు
చెదురుమదురు సంఘటనలు మినహా అందరి సమిష్టి కృషితో ఈ నెల 13 న రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. అదే స్పూర్తితో వచ్చే నెల 4 న జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు చేసుకుని విజయవంతంగా నిర్వహించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆయన కోరారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపులో ఎటు వంటి వివాదాలకు తావులేకుండా సంబందిత వివరాలను అంటే ఏ రోజు న, ఎన్నిక గంటలకు, ఎన్ని టేబుళ్లపై ఓట్ల లెక్కింపు నిర్వహించడం జరుగుతున్నది అనే వివరాలను వ్రాతపూర్వకంగా సంబందిత అభ్యర్థులకు, ఎన్నికల ఏజంట్లకు ముందుగానే తెలియజేయలన్నారు. భద్రత పర్యవేక్షణపై పోలీసు అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని మీనా ఆదేశించారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications