హైద్రాబాద్‌లో అడుగిడిన బాబు: టిడిపిలో మార్పులు, ఏపీ చీఫ్‌గా అశోక్?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదమూడు రోజుల అనంతరం ఆదివారం నాడు హైదరాబాదుకు వచ్చారు. గోదావరి పుష్కరాలు పూర్తి అయ్యే వరకు రాజమండ్రిలోనే ఉండి పర్యవేక్షించారు. రెండు రోజుల క్రితం పుష్కరాలు పూర్తి కావడంతో ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చారు.

బేగంపేట విమానాశ్రయంలో దిగిన ఆయనకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర రావు తదితరులు స్వాగతం పలికారు.

Chadrababu Naidu arives Hyderabad

టిడిపిలో నెల రోజుల్లో కీలక మార్పులు

టిడిపిలో నెల రోజుల్లో కీలక మార్పులు జరగనున్నాయని తెలుస్తోంది. తెలంగాణ, ఏపీలకు రెండు నూతన కమిటీలను, వేర్వేరుగా అధ్యక్షులను నియమించనున్నారు. చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఈ మేరకు మహానాడులో తీర్మానించారు.

దానికి అనుగుణంగా పార్టీలో అంతర్గతంగా కసరత్తు జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల కమిటీలకు సంబంధించి అత్యున్నత నిర్ణయాధికార వ్యవస్థగా పొలిట్ బ్యూరో ఉండనుంది. దీనిని కూడా త్వరలోనే కొత్తగా ఏర్పాటు చేయనున్నారు.

ఇప్పుడున్న వారిలో ఎక్కువ మందికి తిరిగి స్థానం ఇచ్చి, కొత్తవారిని కొందరికి అవకాశం కల్పించనున్నారు. ఏపీ టిడిపి అధ్యక్షుడిగా కళా వెంకట్రావు లేదా అశోక్ గజపతి రాజు పేర్లను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. సీనియర్లకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. యనమల రామకృష్ణుడి పేరును పరిశీలిస్తున్నారు.

తెలంగాణలో మాత్రం ప్రస్తుతం ఉన్న వారే ఉండనున్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు యువత బాధ్యతలు ఎంపీ రామ్మోహన్ నాయుడికి అప్పగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+