కడపలో మరోసారి కుర్చీ పోరు-ఎమ్మెల్యేకు మళ్లీ అవమానం-ఫ్లెక్సీలతో కౌంటర్..!

కడపలో మరోసారి వైసీపీ, టీడీపీ విభేదాలు భగ్గుమన్నాయి. ఇవాళ జరిగిన మున్సిపల్ కౌన్సిల్ భేటీల మరోసారి ఎమ్మెల్యే మాధవీరెడ్డికి కుర్చీ కేటాయింపు వివాదం తెరపైకి వచ్చింది. దీంతో కౌన్సిల్లో వైసీపీ, టీడీపీ కార్పోరేటర్లు పరస్పరం మాటల యుద్ధానికి దిగారు. ఎమ్మెల్యేకు కుర్చీవేయకుండా కేవలం మేయర్ కు మాత్రమే వేయడంతో ఆమె నిరసనకు దిగారు. వీరిద్దరికీ మద్దతుగా కార్పోరేటర్లు నినాదాలు చేసుకున్నారు.

వైసీపీ, టీడీపీ మధ్య కూటమి ప్రభుత్వం వచ్చాక సాగుతున్న పోరుకు కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మరోసారి వేదికైంది. ఇవాళ కౌన్సిల్ భేటీలో మేయర్‌ సురేశ్‌కు మాత్రమే కార్పొరేషన్ సిబ్బంది కుర్చీ వేశారు. దీంతో మేయర్ సురేశ్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి మళ్లీ వాగ్వాదానికి దిగారు. గత సమావేశంలోనూ ఇలాగే జరగడంతో అప్పట్లో ఇరువర్గాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి. ఇవాళ మరోసారి అదే జరగడంతో మహిళలను మేయర్ అవమానిస్తున్నారని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేకు మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు.

chair row between Kadapa mla madhavi reddy and mayor suresh babu in municipal corporation

మరోవైపు కార్పోరేషన్ లో తన పంతం నెగ్గకపోవడంతో నగరంలో ఎమ్మెల్యే మాధవీరెడ్డి మేయర్ సురేశ్ బాబు భార్య జయశ్రీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టించారు. మేయర్ సురేష్ బాబు సతీమణి జయశ్రీని ఉద్దేశించి హూ ఈజ్ కె.జయశ్రీ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. అలాగే మహిళలు అంటే చిన్న చూపా అంటూ ఇందులో ప్రశ్నించారు. జయశ్రీ పేరు మీద రెండు ఫ్లోర్లకు అనుమతి తీసుకొని, నాలుగు ఫ్లోర్ కట్టారు అంటూ మరో ఫ్లెక్సీ పెట్టారు. కార్పోరేషన్ అధికారులకు ఇది కనిపించలేదా అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో కౌన్సిల్ లోపల వైసీపీ, బయట టీడీపీ ఆధిపత్యం కనిపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+