Chalo Vijayawada: సచివాలయ ఉద్యోగుల ఛలో విజయవాడ- పోలీసుల కీలక ప్రకటన..!

తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు రేపు ఛలో విజయవాడ (Chalo Vijayawada) చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం విజయవాడకు చేరుకుని ధర్నా చౌక్ లో భారీ ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాల నుంచి ఉద్యోగులు తరలివస్తున్నారు. దీనిపై విజయవాడ పోలీసులు స్పందించారు.శాంతి భద్రతల నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చేపట్టదలిచిన ధర్నా, ర్యాలీలు, ఇతర కార్యక్రమాలకు అనుమతులు నిరాకరించారు.

ఈసీ ప్రకటనపై చంద్రబాబు కీలక ట్వీట్- జగన్ కు భిన్నంగా అనూహ్య స్టాండ్..!
ఈసీ ప్రకటనపై చంద్రబాబు కీలక ట్వీట్- జగన్ కు భిన్నంగా అనూహ్య స్టాండ్..!

గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు వారి యొక్క సమస్యలపై నిరసన తెలిపేందుకు 27వ తేదీిన రాష్ట్ర స్థాయి పిలుపులో భాగంగా NTR పోలీస్ కమిషనరేట్ పరిధిలో ధర్నా, ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతులు కోరారని పోలీసులు తెలిపారు. ఈ నేపధ్యంలో నగరంలో BNSS సెక్షన్ 163, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నందన, నగరంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని అనుమతులు నిరాకరించినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలో వరద ముంపు సవాళ్లు, వినాయక నిమజ్ఝన కార్యక్రమాలు, ఊరేగింపులు, ట్రాఫిక్ అంతరాయాలు, శాంతిభద్రతల పరిరక్షణ మరియు ట్రాఫిక్ నియంత్రణ పనుల్లో పోలీస్ యంత్రాంగం మరియు సిబ్బంది తీవ్రంగా నిమగ్నమై ఉన్నారని తెలిపారు.

Chalo Vijayawada on Sunday Police Deny Permission to Secretariat Employees Seek Cooperation
సీఈసీని తక్షణం తొలగించండి..! కేంద్రానికి వైసీపీ సంచలన డిమాండ్ ..! ఇక పోరాటమే..!
సీఈసీని తక్షణం తొలగించండి..! కేంద్రానికి వైసీపీ సంచలన డిమాండ్ ..! ఇక పోరాటమే..!

ఈ పరిస్థితులను దృష్ట్యా, శాంతిభద్రతలకు, ప్రజా సౌకర్యానికి విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీస్ వారు సచివాలయ ఉద్యోగుల ధర్నా కార్యక్రమానికి అనుమతిని నిరాకరించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న సచివాలయ సిబ్బంది ప్రస్తుత అత్యవసర పరిస్థితులను అర్థం చేసుకుని, పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అనుమతి లేకుండా ధర్నాలు, నిరసనలు లేదా చట్టవిరుద్ధంగా కూడళ్ల వద్ద సమావేశాలు నిర్వహిస్తే చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ధర్నా ముసుగులో అసాంఘిక శక్తులు ప్రవేశించి ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్నందున, ఈ నిరసన కార్యక్రమాన్ని విరమించుకోవాలని, పోలీస్ వారికి సహకరించాలని కూడా కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+